కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు తమ సరిహద్దులను తాత్కాలికంగా మూసేశాయి. ఫలితంగా విమానయాన సంస్థల ఆదాయం భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది జీతం మినహా మిగతా ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధించినట్లు తెలిపింది.
మార్చి నుంచి మూడు నెలల పాటు 10 శాతం తగ్గించడమే కాకుండా వ్యయ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలను పొందడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఎయిర్ఇండియా నిర్ణయించింది. దీనికి సంబంధించి అధికారులు చర్యలు వేగవంత చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: ఉద్యోగులకు కరోనా దెబ్బ- జీతాలు తగ్గిస్తున్న సంస్థలు