ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: ఆ సంస్థ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత - గోఎయిర్​ ఉద్యోగుల వేతనాల్లో కోత

దేశీయ విమానయాన సంస్థ గోఎయిర్​ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం కారణంగా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల వేతనంలో 50 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.

GoAir announces 50 pc pay cut for its top employees
గోఎయిర్​ సంస్థ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత
author img

By

Published : Mar 22, 2020, 5:40 AM IST

ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దేశీయ విమానయాన సంస్థ గోఎయిర్. కరోనా సంక్షోభం కారణంగా ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది వేతనంలో 50శాతం కోత పెట్టనుంది. ఈ మేరకు గోఎయిర్​​ సీఈఓ వినయ్​ డ్యూబ్​ ఓ ప్రకటనలో తెలిపారు.

కరోనా వైరస్​ ప్రభావంతో ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దయినందున ఆదాయాలు క్షీణించాయి. ఇదివరకే కొందరు పైలట్లను తొలగించగా.. మరికొందరు ఉద్యోగులకు వేతనంలేని సెలవులను ప్రకటించింది గోఎయిర్. అయితే ఈ చర్యలన్నీ తాత్కాలికమేనని.. వైరస్​ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు వినయ్​.

వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల్ని మూసివేసింది. సంస్థ అవసరాల నిమిత్తం.. ఉద్యోగులకు ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాటుచేశామని వినయ్​ అన్నారు.

ఇది చదవండి: స్టాక్‌ మార్కెట్లు మూసేస్తే.. ప్రత్యామ్నాయం ఉందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.