ప్రపంచంలోని కీలకమైన కార్పొరేట్ కంపెనీల ఆదాయం 2020లో తగ్గవచ్చని సిటీగ్రూప్ అంచనా కట్టింది. ఈ తగ్గుదల 10శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది. రష్యా, సౌదీ మధ్య చమురు యుద్ధం ఈ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని పేర్కొంది.
‘"కార్పొరేట్ ఆదాయం మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఫలితంగా 15-20శాతం ఈపీఎస్పై ప్రభావం చూపవచ్చు. ఇది ప్రపంచ జీడీపీ వృద్ధిరేటులో 1.5శాతం వరకు ఉండవచ్చు."
- రాబర్ట్ బక్‌ల్యాండ్, సిటీగ్రూప్ విశ్లేషకుడు
ముఖ్యంగా కరోనావైరస్ దెబ్బకు చమురు ధరలు పడిపోవడం వల్ల సిటీగ్రూప్ ఈ అంచనాకు వచ్చింది. గత వారం రాబర్ట్ బక్‌ల్యాండ్ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై 2 శాతం ఉంటే గ్లోబల్ ఈపీఎస్ 10 శాతం వరకు దెబ్బతినవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: దిగ్గజ కంపెనీలపై కరోనా పిడుగు!