భాజపా నేతల ట్వీట్లకు మ్యానుపులేటెడ్ మీడియా (Manipulated media) ట్యాగ్ ఇచ్చిన తర్వాత.. పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter) ఆరోపించింది. 'కొవిడ్ టూల్‌కిట్(COVID Toolkit)' ఫిర్యాదు పేరుతో.. సమాచారం కావాలాని దిల్లీ పోలీసులు తమకు నోటీసులిచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో తమ ఉద్యోగుల పట్ల ఆందోళనగా చెందుతున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
కొత్త నిబంధనలు పాటిస్తాం కానీ..
భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలను (New IT rules) పాటించేందుకు ప్రయత్నిస్తామని ట్విట్టర్ వెల్లడించింది. అయితే కొత్త ఐటీ రూల్స్‌లో భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించేలా ఉన్న కొన్ని నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లుగానే భావ ప్రకటన స్వేచ్ఛ, పారదర్శకత, గోప్యతకు(Privacy) ప్రాధాన్యమిస్తూ కార్యకలాపాలు సాగించనున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.
ఇదీ చదవండి:టూల్‌కిట్ వివాదం- ట్విట్టర్‌కు కేంద్రం వార్నింగ్!