ఎయిర్ ఇండియాతో(air india disinvestment news latest) దేశానికి మేలు చేకూరుతుందన్నారు బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్(spice jet owner). ప్రభుత్వం ప్రైవేటీకరణ(Air India privatisation) పూర్తి చేసిన తర్వాత 'మహరాజా' బ్రాండ్ విలువ క్రమంగా పుంజుకుని పూర్వ వైభవాన్ని అందుకుంటుందన్నారు. ఎయిర్ ఇండియా కోసం వ్యక్తిగత హోదాలో బిడ్ దాఖలు చేశారా? అన్న ప్రశ్నకు తనదైన శైలీలో సమాధానమిచ్చారు సింగ్. ' బిడ్ దాఖలు(Air India bidders list) విషయం మీకు తెలుసు కదా. ప్రభుత్వంతో ఒప్పందంపై మేము పూర్తి నమ్మకంతో ఉన్నాము. కాబట్టి, ఎయిర్ ఇండియా బిడ్ల గురించి మాట్లాడలేను.' అని తెలిపారు.
అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 77వ వార్షిక సదస్సుకు హాజరైన క్రమంలో ఎయిర్ ఇండియాపై మాట్లాడారు సింగ్(spice jet owner).
"ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఎలా ఉంటుందనేది అంతా ఊహాజనితం. అయితే.. ఆరోగ్యకరమైన ఏఐ యావత్ దేశానికి మేలు చేస్తుంది. మహారాజను మేము తీసుకున్నా, మరొకరి చేతికి వెళ్లినా.. అది ఆరోగ్యకరమైన ఎయిర్‌లైన్‌గా నిలుస్తుంది. ఎయిర్ ఇండియా బ్రాండ్ క్రమంగా పుంజుకుని గొప్ప స్థాయికి చేరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న ఆ సంస్థ.. భారత్‌కు చాలా అవసరం. "
- అజయ్ సింగ్, స్పైస్ జెట్ సీఎండీ.
ప్రభుత్వ రంగ సంస్థ ఏయిర్ ఇండియాలో 100 శాతం వాటాను(Air India privatisation) విక్రయించాలని భావిస్తోంది కేంద్రం. అందుకోసం బిడ్లు ఆహ్వానించింది. 2020లోనే ఈ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ కొవిడ్-19 కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సెప్టెంబర్ 30కి తుది గడువు విధించిన క్రమంలో స్పైస్ జెట్, టాటా గ్రూప్‌లు బిడ్లు దాఖలు చేశాయి. అక్టోబర్ 1న టాటా గ్రూప్ బిడ్‌కు కేంద్రం ఆమోదం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(డీఐపీఏఎం) సెక్రెటరీ తుహిన్ కాంత్ పాండే ట్వీట్టర్ వేదికగా తెలిపారు.
ఇదీ చూడండి: Air India news: 'ఎయిర్ ఇండియా' వార్తలను ఖండించిన ప్రభుత్వం..!