బందర్లో ఉన్న డైమండ్ మైన్‌కు వచ్చే నెలలో వేలం నిర్వహించనున్నట్లు గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్ ఛత్తర్పుర్ జిల్లాలోని బందర్ గనుల్లో 34.20 మిలియన్ క్యారెట్ల డైమండ్ నిల్వలు ఉన్నట్లు పేర్కొంది.
ఈ డైమండ్ గనులతో కలిపి మొత్తం 13 ఖనిజ నిక్షేపాల గనులకు వేలం నిర్వహించనుంది ప్రభుత్వం. ఇందులో మధ్యప్రదేశ్ సింగ్రౌలిలోని ఛకరియా, కట్నీ లోని ఇమాలియా బంగారు గనులు ఉన్నాయి. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న లైమ్‌స్టోన్, బేస్ మెటల్, బాక్సైట్, గ్రాఫైట్ గనుల తవ్వకాలకూ వేలానికి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
గతంలో వేలం వేసిన 68 ఖనిజ నిక్షేపాల ద్వారా గత 50 ఏళ్లలో రూ.1.99 లక్షల కోట్లు ప్రభుత్వానికి సమకూరినట్లు ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఉన్న, కొత్తగా కనుగొన్న ఖనిజ నిక్షేపాలకు త్వరగా వేలం నిర్వహించాలని పరిశ్రమల సమాఖ్య 'ఫిక్కీ' ఈ ఏడాది ఏప్రిల్‌లో పిలుపు నిచ్చింది. గనులు, ఖనిజనిక్షేపాల అభివృద్ధి, నియంత్రణ చట్టంలో మార్పులు చేసిన తర్వాత ఏడాదికి సగటున 15 గనులే వేలానికి వస్తున్నట్లు ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: జియో ఫీచర్ ఫోన్ ధర ఇక మరింత తక్కువ!