కరోనా కారణంగా ప్రయాణ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా 12,000 మందికి పైగా ఉద్యోగులను బోయింగ్ తొలగిస్తోంది. ఈ వారంలో ఇప్పటికే అమెరికాలో 6,770 మంది ఉద్యోగుల్ని తప్పించింది. మరో 5,520 మంది సిబ్బందిని స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తు చేసుకోవాలని కోరనుంది.
అమెరికాలో ఏప్రిల్ మధ్యలో విమాన ప్రయాణాలు 96 శాతం మేర తగ్గాయి. ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా మారాయి. మంగళవారం అమెరికా విమానాశ్రయాల్లో 2,64,843 మంది అడుగుపెట్టారని.. గతేడాదితో పోలిస్తే ఇది 89 శాతం తక్కువ అని ఒక నివేదిక పేర్కొంది.
తమ సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించనున్నట్లు బోయింగ్ గతంలోనే స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుకు తగినట్లు చర్యలు తీసుకుంటోంది.