ETV Bharat / business

టెలికాం కార్యదర్శితో 'బిర్లా' భేటీ అందుకేనా?

బ్యాంకు పూచీకత్త సొమ్మును జప్తు చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో టెలికాం శాఖ కార్యదర్శిని కలిశారు వొడాఫోన్​ ఐడియా ఛైర్మన్​ కుమార మంగళం బిర్లా. సంస్థ సమస్యల నుంచి బయటపడి నిలబడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

birla, agr, telecom
బిర్లా
author img

By

Published : Feb 18, 2020, 3:25 PM IST

Updated : Mar 1, 2020, 5:49 PM IST

టెలికాం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాశ్​ను వొడాఫోన్​ ఐడియా ఛైర్మన్ కుమార మంగళం బిర్లా దిల్లీలో కలిశారు. ప్రస్తుత సమస్యల నుంచి సంస్థకు ఉపశమనం కల్గించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఏజీఆర్ బకాయిలకు సంబంధించి వొడాఫోన్​ బ్యాంక్​ పూచీకత్తు సొమ్మును ప్రభుత్వం జప్తు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

5 శాతం కన్నా తక్కువ చెల్లింపులు..

టెలికాం శాఖ ఆదేశాల మేరకు రూ.2,500 కోట్లను ఏజీఆర్​ బకాయిల రూపంలో చెల్లించింది వొడాఫోన్​ ఐడియా. మరో రూ.1,000 కోట్లను శుక్రవారం చెల్లిస్తామని చెప్పింది. అయితే ఈ మొత్తం ఆ సంస్థ బకాయిల్లో 5 శాతం కన్నా తక్కువ.

ఏజీఆర్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊరట కల్పించకపోతే వొడఫోన్​ ఐడియా మూతపడుతుందని డిసెంబర్​లో బిర్లా పేర్కొన్నారు.

Last Updated : Mar 1, 2020, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.