ETV Bharat / business

అమెజాన్​ పెట్టుబడిపై ఎయిర్​టెల్ క్లారిటీ - అమెజాన్ ఎయిర్​టెల్ ఒప్పందం వార్తలు

తమ కంపెనీలో అమెజాన్ 5 శాతం వాటా కొనుగోలు చేయనుందంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేసింది ఎయిర్​టెల్​. ఆ వార్తలు నిరాధారమైనవని స్పష్టతనిచ్చింది. ఇలాంటి వార్తలు అనవసర పరిణామాలకు దారితీస్తాయని పేర్కొంది.

no deal between airtel and Amazon
ఎయిర్​టెల్ అమెజాన్​ల మధ్య డీల్​ లేదు
author img

By

Published : Jun 5, 2020, 1:25 PM IST

తమ సంస్థలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టనుందనే వార్తలపై భారతీ ఎయిర్​టెల్ స్పష్టతనిచ్చింది. వాటన్నింటిని గాలి వార్తలుగా కొట్టిపారేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు అనవసర పరిణామాలకు కారణమవుతాయని పేర్కొంది. ఈ ప్రభావం సంస్థ షేర్లపై కూడా పడుతుందని అందోళన వ్యక్తం చేసింది.

పెట్టుబడులపై వార్తలు ఇలా..

భారతీ ఎయిర్​టెల్​లో దాదాపు 5 శాతం వాటను 2 బిలియన్ డాలర్ల (రూ.15,000 కోట్లు)తో అమెజాన్​ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందానికి సంబంధించి రెండు సంస్థల మధ్య చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమైన నేపథ్యంలో ఎయిర్​టెల్ స్పందించింది.

వొడాఫోన్​ గూగుల్ డీల్​కూడా అంతే...

సంక్షోభంలో చిక్కుకున్న టెలికాం సంస్థ వొడాఫోన్​ ఐడియాలో టెక్​ దిగ్గజం గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన వొడాఫోన్ ఐడియా గూగుల్​తో పెట్టుబడులకు సంబంధించి తమ ముందు ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టతనిచ్చింది.

జియోకు మాత్రం పెట్టుబడుల ప్రవాహం..

ఎయిర్​టెల్, వొడాఫోన్ ఐడియాల్లో పెట్టుబడులపై వచ్చిన వార్తలు వదంతులుగా తేలినా.. రిలయన్స్ జియో విషయంలో మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. జియోకు విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫేస్​బుక్​తో పాటు ఐదు విదేశీ ఇన్వెవెస్ట్​మెంట్ సంస్థలు జియోలో పెట్టుబడి పెట్టగా.. తాజాగా అబుదాబికి చెందిన మరో సంస్థ జియోలో పెట్టుబడి పెట్టింది. ముబ్దాలా అనే సంస్థ రూ.9,093.60 కోట్లతో జియోలో 1.85 శాతం వాటా కొనుగోలు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.