గత కొన్ని నెలలుగా దేశంలో గృహ నిర్మాణ రంగంలో అనిశ్చితి నెలకొంది. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో నిర్మాణం పూర్తయిన ఇళ్లు చాలా వరకు అమ్ముడవ్వలేదు. వీటిని విక్రయించేందుకు ఆయా నగరాలకు ఎంత సమయం పడుతుందనే దానిపై ప్రముఖ స్థిరాస్తి రంగ సంస్థ 'అనరాక్' ఓ నివేదిక విడుదల చేసింది.
అనరాక్ నివేదిక ప్రకారం హైదరాబాద్, దిల్లీ (ఎన్సీఆర్), ముంబయి (ఎంఎంఆర్), కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణెల్లో.. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 6.56 లక్షల ఇళ్లు అమ్ముడవకుండా మిగిలిపోయాయని తెలిసింది.
బెంగళూర్లో వేగంగా..
సెప్టెంబర్ నాటికి మూడు నెలల కాలంలో విక్రయం కాకుండా మిగిలిపోయిన ఇళ్లను అమ్మేందుకు 15 నెలల సమయం పడుతుందని అనరాక్ వెల్లడించింది. ఇతర నగరాలతో పోలిస్తే ఇదే అత్యల్ప సమయంగా అనరాక్ పేర్కొంది. విక్రయమవ్వకుండా మిగిలిపోయిన ఇళ్లను అమ్మేందుకు దిల్లీకి అత్యధికంగా 44 నెలల సమయం పడుతుందని అంచనా వేసింది.
నగరాల వారీగా అమ్ముడవ్వని గృహాలు..
- ముంబయి (ఎంఎంఆర్)- 2.21 లక్షలు
- దిల్లీ (ఎన్సీఆర్)- 1.78 లక్షలు
- పుణే- 92,560
- బెంగళూరు- 63,540
- కోల్కతా- 45,570
- చెన్నై- 31,380
- హైదరాబాద్- 23,890
ఇదీ చూండండి: అక్టోబర్లో 4.62 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం