నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు మద్దతు తెలిపినప్పటికీ.. 'భారత్ బంద్'కు మాత్రం దూరంగా ఉన్నాయి బ్యాంక్ యూనియన్లు.
రైతుల చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్నామని.. బంద్‌లో మాత్రం పాల్గొనడం లేదని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ), అఖిల భారత ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రకటించాయి.
రైతులకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని వెల్లడించాయి బ్యాంక్ సంఘాలు. పనిగంటల ముందు, తర్వాత నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నాయి.
ఇదీ చూడండి:రైతు భవిత పరాధీనం- అందుకే అన్నదాత ఆగ్రహం!