ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ బీఎస్-6 మోడల్ బైక్‌ను మార్కెట్‌లోకి బుధవారం తీసుకొచ్చింది. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న బజాజ్ పల్సర్ 150 బైక్‌ల్లో బీఎస్-6 మోడల్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.94,956 (దిల్లీ ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. పల్సర్ 150, 150 ట్విన్ డిస్క్ వేరియంట్లలో ఈ బైక్ తీసుకొచ్చారు.
మొదటి వేరియంట్ పల్సర్ 150 ధర రూ.94,956, ట్విన్ డిస్క్ ధర రూ.98,835గా ఉంటుందని సంస్థ పేర్కొంది. బీఎస్4 వాహనాలతో పోలిస్తే బీఎస్-6 ద్విచక్రవాహనాల ధర దాదాపు రూ.8,998 పెరిగినట్లు సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని బీఎస్-6 వాహనాలను తీసుకురానున్నట్లు కంపెనీ బైక్ విభాగ ప్రెసిడెంట్ సరంగ్ కనడే తెలిపారు. పల్సర్ 150 బీఎస్-6 కూడా అద్భుత పనితీరు కనబరుస్తుందని చెప్పారు.