ఆటోమేషన్, రోబోటిక్స్ వల్ల ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని అనుకుంటున్నప్పటికీ... వీటిపై పెట్టుబడులు పెడుతున్న సంస్థలే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయని న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ ఎక్రిడేషన్ కౌన్సిల్) మాజీ సలహాదారు ప్రొఫెసర్ విష్ణుకాంత్ చట్‌పల్ అన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో (జేఎన్టీయూ) 'ఎమర్జింగ్ టెక్నాలజీస్’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తుపై ధీమాతో ఆయా కంపెనీలు ఈ పెట్టుబడులు పెడుతున్నాయన్నారు.
'అప్‌గ్రేడ్ కావాలి'
ప్రస్తుతం అన్ని రంగాల పరిశ్రమలు అప్‌గ్రేడ్ అవుతున్నాయని..… రోబోటిక్స్ , ఐటీ వల్ల ప్రతి రంగం విజ్ఞాన పెట్టుబడికి ప్రాధాన్యత ఇస్తోందని చట్‌పల్ అన్నారు.
"ఉద్యోగుల నైపుణ్యాల పెంపు విషయంలో సంస్థల దృక్పథం మారింది. అన్ని రకాల పరిశ్రమలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే.. ప్రస్తుతం 80 శాతం కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యం పెంపుపై ఖర్చు పెడుతున్నాయి. 2011లో ఇది కేవలం 20 శాతమే ఉండేది." - ప్రొఫెసర్ విష్ణుకాంత్ చట్‌పల్, న్యాక్ మాజీ సలహాదారు
ఇదీ చూడండి: సిరి: 'ఇతర ఆదాయాల'కూ లెక్క చూపాలి