ETV Bharat / business

' కొత్త నిబంధనల మేరకు ఆ పదవులకు శాశ్వత అధికారులు' - ట్విట్టర్​ గ్రీవెన్స్​ అధికారి

నూతన ఐటీ నిబంధనల ప్రకారం సీసీఓ, ఆర్​జీఓ, నోడల్ అధికారులుగా శాశ్వత ఉద్యోగులను నియమించామని దిల్లీ హైకోర్టుకు ట్విట్టర్​ సంస్థ తెలిపింది. అయితే.. ప్రమాణ పత్రంలో ఈ నియామకాలకు సంబంధించిన విషయాలను ట్విట్టర్​ పొందుపర్చలేదని న్యాయస్థానం పేర్కొంది.

twitter india
ట్విట్టర్​
author img

By

Published : Aug 6, 2021, 6:04 PM IST

నూతన ఐటీ నిబంధనల ప్రకారం.. చీఫ్​ కంప్లైయన్స్​ ఆఫీసర్​(సీసీఓ), రెసిడెంట్​ గ్రీవెన్స్​ ఆఫీసర్​(ఆర్​జీఓ), నోడల్ కాంటాక్ట్​ అధికారులుగా శాశ్వత ఉద్యోగులను నియమించినట్లు దిల్లీ హైకోర్టుకు సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ శుక్రవారం తెలిపింది. అయితే... ఈ మేరకు ట్విట్టర్​ దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో సరైన వివరాలు లేవని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ వివరాలన్నీ ఉండేలా చూడాలని తెలిపింది. ఈమేరకు ప్రమాణ పత్రం కాపీలను కేంద్ర కౌన్సిల్​ సహా ఇతర కక్షిదారులకు అందజేసినట్లు జస్టిస్​ రేఖా పల్లి పేర్కొన్నారు.

సీసీఓ, ఆర్​జీఓ, నోడల్​ అధికారి పదవుల కోసం శాశ్వత అధికారులను నియమించామని ట్విట్టర్​ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సాజన్​ పూవయ్య.. కోర్టుకు నివేదించారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు 4నే ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రమాణపత్రం దాఖలు చేశారు.

నిబంధనలు పాటించారా?

వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అధికారుల నియామకంలో నూతన ఐటీ నిబంధనలను పాటించారా? అని ప్రశ్నించింది. దీనిపై కేంద్ర తరఫున హాజరైన అదనపు సొలిసిటర్​ జనరల్​ చేతన్ శర్మ స్పందించారు. ఈ విషయాన్ని ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 10కి న్యాయస్థానం వాయిదా వేసింది.

అంతకుముందు.. తాత్కాలిక ఉద్యోగిని సీసీఓ పదవిలో నియమించిన ట్విట్టర్​ తీరుపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సామాజిక వేదిక కొత్త ఐటీ నిబంధనలను పాటించడం లేదని స్పష్టం చేసింది. సంస్థలో అత్యంత కీలకమైన నిర్వహణ అంశాలు చూసే ఉద్యోగి లేదా సీనియర్ ఉద్యోగిని సీసీఓగా నియమించడాన్ని నిబంధనలు తప్పనిసరి చేశాయని​ గుర్తుచేసింది. ట్విట్టర్​ మాత్రం తన ప్రమాణ పత్రంలో మూడోపక్ష గుత్తేదారు ద్వారా తాత్కాలిక ఉద్యోగిని నియమించినట్లు వెల్లడించిందని చెప్పింది.

ఇదీ చూడండి: ట్విట్టర్‌ ఇండియా ఎండీకి హైకోర్టులో ఊరట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.