ETV Bharat / business

'వినియోగదారులారా.. అప్​డేట్​ చేసుకోండి ప్లీజ్'​ - యాపిల్​ ఐఫోన్​ భద్రత

దిగ్గజ స్మార్ట్​ఫోన్​ సంస్థ యాపిల్​ కీలక ప్రకటన చేసింది. వినియోగదారులు తక్షణం తమ డివైస్​​లను అప్​డేట్​ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. భద్రతా పరమైన సమస్యలు ఉండటమే కారణమని పేర్కొంది.

apple, update
అప్​డేట్​ చేసుకోండి ప్లీజ్​ : యాపిల్
author img

By

Published : Jan 28, 2021, 9:21 AM IST

ఐఫోన్​, ఐప్యాడ్​ వినియోగదారులు వారి డివైస్​లను అప్డేట్​ చేసుకోవాలని యాపిల్​ సంస్థ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత వెర్షన్​లో హ్యాకర్ల మూలంగా భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన సాఫ్ట్​వేర్​ అప్​గ్రేడ్​లను వినియోగదారులకు మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేసింది.

ఈ సమస్యపై అనామక పరిశోధకులు తమను హెచ్చరించారని యాపిల్​ వెల్లడించింది. యాపిల్ ఆపరేటింగ్​ సిస్టమ్​లో కీలక పాత్ర పోషించే 'కెర్నల్​' సహా 'వెబ్​కిట్'​ అనే వెబ్​బ్రౌజర్ ఇంజిన్​పైన భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఏ రకంగా భద్రతకు ముప్పు ఉందో అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ అప్​గ్రేడ్​ ఐఫోన్​ 6 మొదలు అన్ని రకాల యాపిల్​ డివైస్​ల్లో లభిస్తుంది.

ఇదీ చదవండి : 2021 ప్రథమార్ధంలో 9.6 కోట్ల ఐఫోన్లు ఉత్పత్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.