ETV Bharat / business

అప్పుడు ఐఫోన్ వాడితే మీ ఖాతాకు రూ.1,800 జమ!

మీరు ఐఫోన్​ స్లోడౌన్​ బాధితులైతే మీకు రూ.1,800 చెల్లించనుంది యాపిల్​. 2017లో సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ కారణంగా ఐఫోన్​కు చెందిన పలు మోడళ్లు నెమ్మదించాయన్న ఆరోపణలపై 500 మిలియన్​ డాలర్ల జరిమానా విధించింది కాలిఫోర్నియా కోర్టు.

iphone, apple
ఐఫోన్​
author img

By

Published : Mar 3, 2020, 12:52 PM IST

ఐఫోన్​ స్లోడౌన్​ బాధిత వినియోగదారులకు యాపిల్​ సంస్థ రూ.1,800 చెల్లించనుంది. 2017లో బ్యాటరీ సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ కారణంగా ఐఫోన్లు నెమ్మదించిన కేసులో 500 మిలియన్​ డాలర్ల సెటిల్​మెంట్​లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రతిపాదనకు కాలిఫోర్నియా శాన్​జోస్​ జిల్లా జడ్జీ ఆమోదం పొందాల్సి ఉంది.

2017 డిసెంబర్​ 21న ఐఓఎస్​ 10.2.1 అప్​డేట్​ను అందిచ్చింది యాపిల్​. దీనిని ఇన్​స్టాల్​ చేసుకున్న ఐఫోన్​ 6, 6 ప్లస్​, 6ఎస్​, 6ఎస్ ప్లస్, 7, 7ప్లస్, ఎస్​ఈ మోడల్​ మొబైళ్లు నెమ్మదించాయి. వీటిని మీరు ఆ సమయంలో కలిగి ఉంటే మీకూ ఆ మొత్తం అందుతుంది.

ఉద్దేశపూర్వకంగా..!

2017లో కొన్ని ఐఫోన్లు స్లోడౌన్ అయ్యాయని యాపిల్ ఒప్పుకుంది. అయితే ఇదంతా ఆయా ఫోన్ల జీవితకాలం పెంచడం కోసమే చేసినట్లు తెలిపింది.

యాపిల్ ఉద్దేశపూర్వకంగానే పై మోడళ్లకు సాఫ్ట్​వేర్ అప్​డేట్​ పంపించింది. దీనిలో డైనమిక్ పవర్ మేనేజ్​మెంట్ సిస్టమ్ ఉంది. దీని ద్వారా ఆయా ఐఫోన్లు స్లోడౌన్ అయ్యేలా యాపిల్ చేసింది.

వినియోగదారులు చాలా కాలంగా తమ ఐఫోన్ల పనితీరు నెమ్మదించడాన్ని గమనిస్తూనే ఉన్నారు. వినియోగదారులు కొత్త ఐఫోన్లు కొనుగోలు చేసేలా చేయడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమని వారు గుర్తించారు.

ఫ్రాన్స్​లో రూ.195 కోట్లు..

తొలుత ఈ విషయాన్ని ఫ్రాన్స్​కు చెందిన డీజీసీసీఆర్​ఎఫ్​ గుర్తించింది. యాపిల్​పై సుమారు రూ.195 కోట్ల జరిమానా విధించింది. దీనిని చెల్లించేందుకు యాపిల్​ అంగీకరించింది. అలాగే తన ఫ్రెంచ్ భాషా వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన ప్రకటనను ఒక నెల పాటు ప్రచురించింది. దీని ఆధారంగా ప్రస్తుత కేసును కాలిఫోర్నియాలోని శాన్​జోస్​ కోర్టు విచారిస్తోంది.

కొత్తవి కొనాల్సిందే!

పాత ఐఫోన్లలో ఉండే లిథియం అయాన్ బ్యాటరీల సామర్థ్యం చాలా తక్కువ. దీనికి తోడు ఐఫోన్​ అప్​డేట్​తో అవి మరింత స్లోడౌన్ అయ్యాయి. దీని వల్ల ఐఫోన్ల జీవితకాలం తగ్గుతుంది. ఫలితంగా వినియోగదారులు కచ్చితంగా కొత్త బ్యాటరీలు మార్చాల్సి ఉంటుంది. లేదా కొత్త ఫోన్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇదే యాపిల్ ఎత్తుగడ!

ఇదీ చూడండి: ఐఫోన్లు స్లోడౌన్​.. యాపిల్​కు రూ.195 కోట్లు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.