దేశీయ దిగ్గజ సంస్థ మహీంద్రా గ్రూప్ నేడు కీలక ప్రకటన చేసింది. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి ఆనంద్ మహీంద్రా త్వరలో తప్పుకోనున్నట్లు వెల్లడించింది.
"ఆనంద్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 1న తప్పుకోనున్నారు. ఆ తర్వాత ఆయన మహీంద్రా అండ్ మహీంద్రా నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం."
-మహీంద్రా గ్రూప్ అధికారిక ప్రకటన
నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా.. ఆనంద్ మహీంద్రా డైరెక్టర్ల బోర్డు మెంటర్‌గా, కంపెనీ వ్యూహాత్మక ప్రణాళిక, రిస్క్ మేనేజ్మెంట్ వంటి పలు బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఆనంద్ మహీంద్రా.. ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన అనంతరం పవన్ గోయెంకా ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు.
ఇదీ చూడండి:కోటికిపైగా ఫాస్టాగ్‌లు విక్రయం: ఎన్హెచ్ఏఐ