ETV Bharat / business

కరోనా వేళ ఆ కుబేరుల సంపద ఇంత పెరిగిందా?

కరోనాతో​ లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. లాక్​డౌన్​ ప్రభావంతో అమెరికాలో 3.8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కానీ అమెరికాలోని 600 మంది కుబేరుల సంపద 434 బిలియన్​ డాలర్లు పెరిగింది. వీరిలో మొదటి ఐదుగురు అయిన బెజోస్​, గేట్స్, జుకర్​బర్గ్​, బఫెట్​, ఎలిసన్​ సంపద 19 శాతం వృద్ధి చెందింది.

American billionaires
అమెరికా కుబేరుల సంపద
author img

By

Published : May 23, 2020, 7:55 PM IST

కరోనా మహమ్మారితో అమెరికాలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కానీ, అగ్రరాజ్యంలో కుబేరుల సంపద మాత్రం భారీగా పెరిగింది. వైరస్​ ప్రారంభమైన తొలి రెండు నెలల కాలంలో 434 బిలియన్​ డాలర్లు అధికమైందని తెలుస్తోంది.

వీరిలో అత్యధికంగా అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ 34.6 బిలియన్​ డాలర్లు ఆర్జించారు. తర్వాత ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​ 25 బిలియన్​ డాలర్లు వెనకేశారు. ప్రపంచంలోని మొదటి ఐదుగురు కుబేరులు.. జెఫ్​ బెజోస్​, బిల్​గేట్స్, జుకర్​బర్గ్, వారెన్​ బఫెట్, ల్యారీ ఎలిసన్​ సంపద 75.5 బిలియన్​ డాలర్లు పెరిగింది. అంటే 19 శాతం వృద్ధి సాధించారు.

భారీ వ్యత్యాసం..

ఫోర్బ్స్​ సమాచారం ప్రకారం.. మార్చి 18 నుంచి మే 19 మధ్య కాలంలో బిలియనీర్ల సంపద 2.948 ట్రిలియన్​ డాలర్ల నుంచి 3.382 ట్రిలియన్​ డాలర్లకు చేరింది. దాదాపు 600 మంది కుబేరుల సంపద 15 శాతం అంటే 434 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇదే సమయంలో 3.8 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. 15 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు.

"కరోనా వల్ల అమెరికా మొత్తం లాక్​డౌన్​లో ఉంది. కానీ అమెరికాలోని కోటీశ్వరులు మొదటి రెండు నెలలు ఆర్థికంగా మరింత బలపడ్డారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి చాలా మంది అసమాన త్యాగాలు చేస్తోంటే.. వీరి సంపద పెరగటం అర్థరహితం. లక్షలాది మంది ప్రమాదంలో ఉంటే ఆరోగ్య కార్యకర్తలు ముందుండి స్పందించారు. కానీ మన ఆర్థిక వ్యవస్థ, పన్ను విధానంతో కుబేరులు లాభపడుతున్నారు."

- బిలియనీర్ బొనాంజా 2020 నివేదిక

ఇదీ చూడండి: విమానాలను ధ్వంసం చేసే లేజర్ అమెరికా సొంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.