కరోనా మహమ్మారి చాలా కంపెనీలను సంక్షోభంలో పడేసింది. అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ విషయంలో మాత్రం ఇది పూర్తి విరుద్దం. ఎందుకంటే కొవిడ్ సంక్షోభం అమెజాన్‌కు రికార్డు స్థాయి లాభాలను తెచ్చిపెడుతోంది.
మూడింతలు పెరిగిన లాభం..
ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 8.1 (దాదాపు రూ.60 వేల కోట్లు) బిలియన్ డాలర్ల లాభాన్ని గడించినట్లు అమెజాన్ తాజాగా ప్రకటించింది. 2020 ఇదే సమయంతో(2.5 బిలియన్ డాలర్లు) పోలిస్తే ఈ మొత్తం దాదాపు మూడింతలు ఎక్కువ.
2021 తొలి మూడు నెలల్లో ఆదాయం ఏకంగా 108.5 బిలియన్ డాలర్లు (రూ.8 లక్షల కోట్ల పైమాటే)గా నమోదైనట్లు వెల్లడించింది అమెజాన్. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 44 శాతం అధికం. ఆదాయం 100 బిలియన్ డాలర్ల మార్క్ దాటడం ఇది వరుసగా రెండో త్రైమాసికం.
కరోనా నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా జరుగుతుండటం ఈ స్థాయి లాభాలకు కారణంగా తెలిపింది అమెజాన్.
ఇదీ చదవండి:క్యూ1లో శాంసంగ్‌కు భారీ లాభాలు