ETV Bharat / business

ఆ సంస్థల కోసం అమెజాన్ ప్రత్యేక నిధి

కరోనా సంక్షోభంలో భాగస్వామ్య కంపెనీలకు అండగా నిలిచింది అమెజాన్ ఇండియా. తమపై ఆధారపడిన చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.

amazon special fund to partner logistics
భాగస్వామ్య కంపెనీలకు అమెజాన్ సాయం
author img

By

Published : Apr 29, 2020, 1:05 PM IST

భాగస్వామ్య సంస్థలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ప్రకటించింది. ముఖ్యంగా తమపైనే ఎక్కువగా ఆధారపడిన చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు (ఎస్​ఎంబీ) అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

దేశవ్యాప్త లాక్​డౌన్​తో చాలా ఎస్​ఎంబీలు ఆర్థికంగా బలహీనపడ్డాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది. అందుకే డెలివరీ, ఎంపిక చేసిన రవాణా విభాగ భాగస్వామ్య వ్యాపారులకు ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఏకమొత్తంలో ఆర్థిక సహాయం ఆయా వ్యాపారులకు అనేక విధాలుగా తోడ్పడుతుందని అభిప్రాయపడింది అమెజాన్ ఇండియా. ఎస్​ఎంబీల్లోని దాదాపు 40 వేల మందికి ఉద్యోగులకు దీని ద్వారా మేలు జరుగుతుందని పేర్కొంది.

ఈ ఎస్​ఎంబీలు లాక్​డౌన్ అనంతరం వాటి కార్యకలాపాలు సజావుగా నడిపించేందుకు బీమా, నగదుతో కూడిన అదనపు సహాయాలు అందించనున్నట్లు తెలిపింది అమెజాన్.

ఇదీ చూడండి:ఆ దిగ్గజ సంస్థలో 12 వేల ఉద్యోగాలు కట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.