ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డెలివరీ ప్యాకేజింగ్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో తాము సేవలందిస్తున్న 50కి పైగా కేంద్రాల్లో ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.
2020 జూన్ నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని గతేడాది సెప్టెంబరులో అమెజాన్ ప్రకటించింది. ఈ క్రమంలోనే 2019 డిసెంబరులో బబుల్ ర్యాప్స్, ఎయిర్ పిల్లోస్ వంటి ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉత్పత్తుల స్థానంలో.. పేపర్‌ను తీసుకొస్తూ తొలి మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో 100శాతం బయోడిగ్రేడబుల్ పేపర్ టేప్‌ను ప్రవేశపెట్టింది.
ఇదీ చూడండి:అమెరికన్ పోలీసులకు అమెజాన్ షాక్!