ETV Bharat / business

అమెజాన్ ఉద్యోగులకు వర్క్​ఫ్రం హోం పొడిగింపు - వచ్చే ఏడాది జూన్​ వరకు అమెజాన్ వర్క్ ఫ్రం హోం

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో కరోనా తీవ్రత ఇంకా అదుపులోకి రానందున.. వచ్చే ఏడాది జూన్ 30 వరకు తమ కార్పొరేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. తమ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

Amazon extends Work from Home
అమెజాన్ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం పొడగింపు
author img

By

Published : Oct 21, 2020, 3:06 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడం వల్ల ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు కొంత వెసులుబాలు కల్పించింది. తమ సంస్థకు చెందిన కార్పొరేట్‌ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోంను పొడిగించింది. అమెరికా వ్యాప్తంగా కొవిడ్‌-19 కేసులు మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో.. తమ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.

వర్క్‌ఫ్రం హోంకు అవకాశం ఉన్నవారు జూన్‌ 30, 2021 వరకు దీనిని వినియోగించుకోవాలని అమెజాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలోని ఈ సంస్థ ఉద్యోగుల్లో 19,000 మందికి కొవిడ్ సోకిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. కరోనా కాలంలో కూడా గోదాములను తీసి ఉద్యోగులను ప్రమాదంలోకి నెట్టిందని అమెజాన్‌పై విమర్శలు కూడా ఎదుర్కొంది.

అదే బాటలో ప్రముఖ సంస్థలు

కరోనా నేపథ్యంలో తొలుత స్పందించి ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించిన అంతర్జాతీయ సంస్థల్లో ట్విటర్‌ మొదటిది. ఈ సంస్థ మే నుంచే తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాలని సూచించింది. మైక్రోసాఫ్ట్‌ కూడా తన ఉద్యోగుల్లో అధిక శాతం మందికి శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసే సదుపాయాన్ని కల్పించింది. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా వర్క్‌ఫ్రం హోమ్‌ చేస్తున్న తమ ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తున్నట్టు యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తెలిపారు. దాదాపుగా ఏడు నెలల నుంచి గూగుల్‌ సంస్థ కూడా తమ సిబ్బందికి 'వర్క్‌ ఫ్రమ్‌ హోం' అవకాశాన్ని కల్పించింది. కోకోకోలా, స్క్వేర్‌ తదితర ప్రముఖ సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.

ఇదీ చూడండి:గృహ రుణాలపై స్టేట్​ బ్యాంక్​ వడ్డీ రాయితీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.