ETV Bharat / business

కరోనా వచ్చిందని భయంగా ఉందా? తెలుసుకోండి ఇలా... - జియో రిస్క్ యాప్

కరోనా సోకిందేమోనని భయపడుతున్నారా? సాధారణంగా జలుబు చేస్తేనే ఆందోళన చెందుతున్నారా? ఇలాంటి విషయాల్లో మీకు సాయం చేసేందుకు టెలికాం దిగ్గజాలు రిలయన్స్​ జియో, ఎయిర్​టెల్​ ప్రత్యేక టూల్స్​ను తీసుకొచ్చాయి. అవేంటో చూద్దామా?

risk app
రిస్క్ యాప్
author img

By

Published : Mar 27, 2020, 9:48 AM IST

కరోనా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ తమకూ ఆ వైరస్‌ సోకిందేమోనన్న అనుమానం కొందరిలో కలుగుతోంది. సాధారణంగా వచ్చే జలుబును కూడా కొందరు తీవ్రంగా పరిగణిస్తూ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారు తమకు ఎంత రిస్క్‌ ఉందో తెలుసుకునేందుకు ప్రముఖ టెలికాం సంస్థలు రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ సెల్ఫ్‌ డయాగ్నోసిస్‌ టూల్స్‌ను తీసుకొచ్చాయి.

మీ ఆరోగ్య స్థితి, ప్రయాణ చరిత్ర, ఇతరత్రా వివరాలను బట్టి కరోనా వైరస్‌ రిస్క్‌ను అంచనా వేస్తూ తగిన సూచనలిస్తున్నాయి. కరోనాపై పోరులో భాగంగా ఈ టూల్స్‌ను ఈ రెండు సంస్థలు ప్రజలకు అందుబాటులో ఉంచాయి.

జియో ప్రత్యేక వెబ్​సైట్​..

రిలయన్స్‌ జియో తీసుకొచ్చిన ఈ టూల్‌ 'మై జియో' యాప్‌లో అందుబాటులో ఉంది. దీనికోసం ఓ ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ (https://covid.bhaarat.ai/) ను కూడా రూపొందించింది.

గతంలో పాజిటివ్‌ ఉన్న వ్యక్తిని మీరు కలిశారా? ప్రయాణాలు చేశారా? మీకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలకు మీరిచ్చే సమాధానం ఆధారంగా ఫలితాలను ఈ టూల్‌ వెల్లడిస్తోంది. మీ రిస్క్‌ స్థాయిని చెప్పడంతో పాటు దగ్గర్లోని ల్యాబ్‌ల వివరాలు, ప్రపంచ వ్యాప్తంగా కేసులకు సంబంధించిన గణంకాలను అందిస్తోంది.

అపోలోతో కలిసి ఎయిర్​టెల్​..

ఎయిర్‌టెల్‌ డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలను అనుసరించి అపోలో హాస్పిటల్స్‌ సహకారంతో ఓ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌తోపాటు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను (https://airtel.apollo247.com/) అందుబాటులోకి తీసుకొచ్చింది.

మీ వయసు, లక్షణాలు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీరు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి మీ రిస్క్‌ స్థాయిని చెబుతోంది. మీ రిస్క్‌స్థాయిని బట్టి సమీపంలోని ఆస్పత్రిని సందర్శించడానికి ఈ టూల్స్‌ ఉపయోగపడతాయి.

ఇదీ చూడండి: శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమే!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.