అదర్ పూనావాలా(Adar Poonawalla).. దాదాపు రెండేళ్ల క్రితం వరకు వ్యాపార వర్గాలకు మాత్రమే తెలిసిన ఈ పేరు.. కరోనా తర్వాత సామాన్య ప్రజలకు కూడా సుపరిచితమైంది. ఆయనకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుండటం వల్ల పూనావాల గురించి అందరికీ తెలిసింది. అదర్ పూనావాలా ప్రధాన వ్యాపార విభాగం ఎస్ఐఐ అయినప్పటికీ.. పలు ఇతర వ్యాపారాలను కూడా ఆయన సాగిస్తున్నారు. అందులో ఒకటి పూనావాలా ఫినాన్స్.
అదర్ పూనావాలా ఫినాన్స్ వ్యపారాలకోసం ఇటీవల ఓ కొత్త ఆఫీస్‌ను (Adar Poonawalla’s new office) కూడా కొనుగోలు చేశారు. దీని విలువ (Poonawalla’s new office Value) రూ.464 కోట్లుగా అంచనా. ఆ ఆఫీస్ అంత ఖరీదు ఎందుకు? దానిలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఆఫీస్ ప్రత్యేకతలు..
పుణెలోని ఏపీ81 టవర్స్‌లో.. 13 ఫ్లోర్లలో ఈ ఆఫీస్ ఉంది. ఇది 2023 నుంచి వినియోగంలోకి రానుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే స్థలంతో కలిపి ఈ బిల్డింగ్ 19 అంతస్తులు ఉంటుంది. ఈ మొత్తం బిల్డింగ్‌లో మొదటి, రెండవ అంతస్తులను ఇంతకు ముందే కొనుగోలు చేసింది పూనావాలా ఫినాన్స్ కంపెనీ.
ఆఫీస్‌కోసం వినియోగించే ఫ్లోర్లు మినహా.. మిగతా స్థలాన్ని పార్కింగ్ కోసమే కేటాయించారు. సకల సౌకర్యాలతో ఇది వినియోగంలోకి రానుంది.
ఈ ఆఫీస్ ఈ డీల్ కోసం.. రూ.27.82 కోట్లను కేవలం స్టాంప్ డ్యూటీగా పూనావాలా చెల్లించినట్లు ప్రముఖ బిజినెస్ వార్తా సంస్థ రాసుకొచ్చింది. దీన్ని బట్టే ఆఫీస్ ఎంత ఖరీదైందో అర్థం చేసుకోవచ్చు.
విమానంలో ఆఫీస్..
పుణెలో అత్యంత ధనవంతుల్లో అదర్ పూనావాలా కూడా ఒకరు. పుణెలోని ఇప్పుడున్న ఆఫీస్‌లో ఆయన వ్యక్తిగత క్యాబిన్ ప్రస్తుతం ఎయిర్‌బస్ ఏ320 విమానంలో ఉండటం విశేషం. వింతగా ఉన్నా.. ఆయనకు విమానాలపై ఉన్న ఆసక్తి కారణంగా ఇలా ఎయిర్‌క్రాఫ్ట్‌నే తన ఆఫీస్‌గా మలుచుకున్నారు. దీని విలువ రూ.7.3 కోట్లుగా అంచనా. అదర్ పూనావాలా అభిరుచికి తగ్గట్లు అన్ని రకాల లగ్జరీ సదుపాయాలు ఇందులో ఉంటాయి.
ఇదీ చదవండి: Digital Gold: ఒక్క రూపాయితో బంగారం కొనొచ్చు.. కానీ...