ETV Bharat / business

వ్యాపార ప్రకటనల మోసాలపై కేంద్రం కొరడా! - ప్రకటన మోసానికి అడ్డుకట్ట వేసే చట్టం

టీవీలు, ఇతర మాధ్యమాల్లో వ్యాపార ప్రకటనలు ఇటీవల నిజజీవితానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని సౌందర్య సాధనాలు, ఇతర ఉత్పత్తుల ప్రకటనలు.. ప్రజలను మోసం చేసే విధంగా ఉంటున్నాయి. ఇలాంటి ప్రకటనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. భారీ జరిమానా, జైలు శిక్ష విధించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వశాఖ ముసాయిదా సవరణను ప్రతిపాదించింది.

5-Year Jail, Rs 50 Lakh Fine For Fair Skin Ads, Says Draft Bill
అటువంటి ప్రకటనలపై కేంద్రం కొరడా
author img

By

Published : Feb 7, 2020, 9:52 PM IST

Updated : Feb 29, 2020, 1:56 PM IST

అసత్య ప్రచారాలతో వ్యాపార ప్రకటనలు చేసే వారిపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. చర్మ సౌందర్యం, లైంగిక సామర్థ్యం పెంపు, సంతానోత్పత్తి వంటి వాటి కోసం ఆకర్షణీయమైన ప్రకటనలతో వినియోగదారులను మభ్యపెట్టాలని చూసే వ్యాపార సంస్థలకు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించే విధంగా చట్టంలో మార్పులు చేయనుంది.

ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ డ్రగ్స్‌, మ్యాజిక్‌ రెమిడీస్‌ (అభ్యంతరకర ప్రకటనల చట్టం 1954)కు ముసాయిదా సవరణను ప్రతిపాదించింది. ఇందు కోసం ముసాయిదా చట్టంలో ఉన్న వ్యాధులు, రుగ్మతల జాబితాలో పలు మార్పులు చేసింది. దాని ప్రకారం 78 రకాల వ్యాధులు, రుగ్మతలకు సంబంధించిన ప్రకటనలపైనా నిషేధం విధించింది.

ఇదీ జాబితా..

ఎయిడ్స్‌ నివారణ, లైంగిక సామర్థ్యం పెంపు, చర్మ రంగును మార్చే సౌందర్య ఉత్పత్తులు, వృద్ధాప్యం తగ్గుదల, జుట్టు తెల్లబడటం, మాట తడబటం, మహిళల్లో సంతానోత్పత్తి వంటి వాటిని ముసాయిదాలో చేర్చారు. వీటిని నయం చేయడానికి సంబంధించి మందులు, ఇతర ఉత్పత్తులు, మ్యాజిక్‌ రెమిడీస్‌ లాంటివి ప్రచారం చేయడం నిషేధం.

శిక్షలు ఇలా..

ప్రతిపాదిక ముసాయిదా ప్రకారం మొదటిసారి నేరం రుజువైతే సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలకు రెండేళ్లపాటు జైలు శిక్ష లేదా రూ.10 లక్షల జరిమానా లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉంది. మరోసారి ఇదే నేరం కింద పట్టుబడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

అభ్యంతరాల స్వీకరణ..

మారుతున్న సాంకేతికత పరిజ్ఞానానికి అనుగుణంగా ఈ మార్పు చేస్తున్నట్లు కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే దీనిపై ప్రజలు, వాటాదారుల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలపాలని అధికారులు కోరారు. ఇందుకోసం నోటీసు ఇచ్చిన 45 రోజుల్లో అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది.

అంతే కాకుండా ఈ ముసాయిదాలో ప్రకటనలకు సంబంధించి మరో కీలక అంశాన్ని జోడించారు. వాస్తవానికి విరుద్ధంగా, ఊహాతీతమైన ఆడియో, వీడియో ప్రకటన, రిప్రజెంటేషన్ లేదా లైట్, సౌండ్, స్మోక్‌, గ్యాస్‌, ప్రచురణ, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇంటర్నెట్, వెబ్‌సైట్, నోటీస్, పత్రికా ప్రకటన, బ్యానర్‌, పోస్టర్‌ లాంటి వాటి ద్వారా ప్రచారం చేయడం నిషేధం అని తెలిపింది.

ఇదీ చూడండి:కొత్త పన్ను విధానానికే 80 శాతం మంది ఆసక్తి!

Intro:Body:

Blank

Conclusion:
Last Updated : Feb 29, 2020, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.