ఇటీవల కాలంలో ఎక్కువ పిక్సల్ సామర్థ్యం ఉన్న ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయి. కానీ తొలిసారి 100 మెగా పిక్సల్ ఉన్న మొబైల్ రాబోతోంది. ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే ప్రపంచంలోనే అత్యధిక పిక్సల్ కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా అవతరిస్తుంది.
లెనొవొ సంస్థ ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎవ్వరూ తయారుచేయని 100 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో రాబోతంది. సంస్థ ప్రతినిధి చాంగ్ చెంగ్ చిన్నపాటి హైపర్ వీడియోను చైనా యాప్ 'వీబో'లో విడుదల చేశారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత నివ్వని ఆయన.. బిలియన్ లెవల్ పిక్సల్స్ అంటూ హ్యష్‌ట్యాగ్ జోడించాడు. దీనర్థం 100 మిలియన్ పిక్సల్ లేదా 100 మెగా పిక్సల్ అనుకుంటున్నారు.
- లెనొవొ జెడ్6 ప్రో...
నిజంగా 100 ఎంపీ కెమెరాతో ఫోన్ వస్తే ప్రపంచంలో ఈ ఫీచరుతో వచ్చిన తొలి మొబైల్గా పేరు తెచ్చుకుంటుంది. అయితే టీజర్లో చిన్నపాటి సెన్సార్‌తో ఫోను వెనుక బాగాన్ని చూపించారు. 100 ఎంపీ చిత్రాలు తీయాలంటే వివిధ రకాల సెన్సార్లు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు టెక్ నిపుణులు.
- జూన్‌లోనే విడుదల..?
2019 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా జెడ్6 ప్రో మొబైల్‌ని విడుదల చేస్తామని లెనొవొ వీపీ ఎడ్వర్డ్ చెంగ్ తెలిపారు. 5జీ సపోర్టు చేసే ఈ ఫోన్‌ను ఈ సంవత్సరం జూన్‌లో మార్కెట్లోకి తెస్తామని వెల్లడించారు.
జెడ్5 ప్రోకి అప్డేట్గా వస్తున్న ఈ జెడ్ 6 ప్రో మొబైల్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 855 చిప్సెట్, 12 జీబీ రామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, స్ర్కీను పైనే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వైర్లెస్ ఛార్జింగ్ దీని ప్రత్యేకతలు.