ETV Bharat / business

Yamaha: 'ద్విచక్ర వాహనాలను ఆన్​లైన్​లో కొంటున్నారు' - కరోనా కాలంలో యమహా కంపెనీ

దేశీయ ద్విచక్ర వాహనాల మార్కెట్లో 10% వాటా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యమహాYamaha) మోటార్‌ ఇండియా ఛైర్మన్‌ మోటోఫుమి షితార వెల్లడించారు. కొవిడ్‌-19(Covid-19) రెండో దశ ప్రభావం పరిశ్రమ మీద తీవ్రంగా ఉన్నట్లు, దీనికి తగినట్లుగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సరైన సమయంలో తమ సంస్థ నుంచి విద్యుత్​ వాహనాలను విడుదల చేస్తామని చెప్పారు. పరిశ్రమ ప్రస్తుత స్థితిగతులు, కంపెనీ ప్రణాళికలపై ఆయన 'ఈటీవీ భారత్​'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..

yamaha motor india chairman
యమహా బైకులు
author img

By

Published : May 30, 2021, 6:50 AM IST

దక్షిణాది రాష్ట్రాలు తమకు ఎంతో ముఖ్యమైన మార్కెట్‌ అని తెలిపారు యమహా(Yamaha) మోటార్‌ ఇండియా ఛైర్మన్‌ మోటోఫుమి షితార. సరైన సమయంలో యమహా నుంచి విద్యుత్‌ వాహనాలు(ఈవీలు) తీసుకువస్తామని 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన ఇంకా ఏమేం విశేషాలు పంచుకున్నారంటే..

కొవిడ్‌-19 రెండో దశ ప్రభావాన్ని యమహా ఇండియా ఎలా ఎదుర్కొంటోంది?

కొవిడ్‌-19(Covid-19) రెండో దశ ప్రభావం ఎంతో తీవ్రంగా ఉంది. పరిస్థితులను పూర్తిస్థాయిలో సమీక్షించి తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోని మా యూనిట్లలో ఉత్పత్తి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేశాం. కార్పొరేట్‌ ఆఫీసులోని సిబ్బందికి ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించాం. డీలర్లు, విడిభాగాల సరఫరాదార్లతో నిరంతరం సంప్రదింపులు సాగిస్తూ.. మా వ్యాపార ప్రణాళికలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వాహన నిల్వల తీరుతెన్నులను విశ్లేషిస్తున్నాం. ప్రస్తుత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనటానికి కంపెనీలోనే ఒక టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేశాం. అదే సమయంలో డిజిటల్‌ మార్కెటింగ్‌- విక్రయ విధానాలను విస్తరిస్తున్నాయి. అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ రిటైలింగ్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం.

వినియోగదార్లలో ఏమైనా మార్పులు గమనించారా?

ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం, దానికి అనుగుణంగా సొంత వాహనాలు వినియోగించటం పెరిగింది. దీనివల్ల గతంలో ద్విచక్ర వాహనం వద్దనుకున్న వారు కూడా ఇప్పుడు ముందుకు వచ్చి తమకు నచ్చిన వాహనాన్ని సొంతం చేసుకోవటం కనిపిస్తోంది. అది కూడా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.

మహా వాహనాలకు దక్షిణాది రాష్ట్రాల్లో ఏమేరకు గిరాకీ అధికంగా కనిపిస్తోంది?

మా అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 45- 50 శాతం వరకూ ఉంటుంది. యమహా(Yamaha) స్కూటర్లు, మోటార్‌సైకిళ్లకు దక్షిణాది రాష్ట్రాల్లో ఆదరణ అధికం. ఫాసినో 125 ఎఫ్‌ఐ, రేజర్‌ 125 ఎఫ్‌ఐ, రేజర్‌ స్ట్రీట్‌ ర్యాలీ స్కూటర్లకు వినియోగదార్ల నుంచి అధిక ఆసక్తి కనిపిస్తోంది. 150 సీసీ శ్రేణిలోని యమహా మోటార్‌ సైకిళ్లు యువతను ఆకర్షిస్తున్నాయి.

దేశీయ మార్కెట్లో మీ వాటా ఎంత? దీన్ని పెంచుకునే వ్యూహాలు ఏమిటి?

ప్రస్తుతం యమహాకు(Yamaha) 3.6% మార్కెట్‌ వాటా ఉంది. కానీ ప్రీమియం శ్రేణిలో (149 సీసీ నుంచి 155 సీసీ వాహనాలు) మాకు ఎంతో అధికంగా 19 శాతం వాటా ఉంది. అందుకే మేం ఈ విభాగంపైనే అధికంగా దృష్టి పెడుతున్నాం. మొత్తం మీద 2025 నాటికి 10 శాతం మార్కెట్‌ వాటా సాధించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం.

మీ విస్తరణ ప్రణాళికలు ఎలా ఉన్నాయి?

దేశంలోని రెండు ప్లాంట్లలో మాకు 17.50 లక్షల ద్విచక్ర వాహనాల తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఏటా 10 లక్షల వాహనాలు తయారు చేస్తున్నాం. ప్రస్తుత అవసరాలకు మాకు ఉన్న ఉత్పత్తి సామర్థ్యం సరిపోతుంది. అదే విధంగా దేశవ్యాప్తంగా 25 'బ్లూ స్క్వేర్‌' విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 100 కు పెంచాలని నిర్ణయించాం. వచ్చే 2- 3 ఏళ్లలో 300 విక్రయ కేంద్రాలు ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. భారత దేశంలో యమహా(Yamaha) ఇండియా ఇప్పటి వరకూ రూ.1,600 కోట్లు పెట్టుబడి పెట్టింది. అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు కొనసాగిస్తాం.

విద్యుత్‌ వాహనాలు తీసుకువచ్చే దిశగా యమహా ఆలోచనలేమిటి?

భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. కొన్ని స్టార్టప్‌ సంస్థలే ఈ విభాగంలో ఉన్నాయి. ప్రభుత్వ నుంచి ఇంకా అధిక మద్దతు ఈ విభాగానికి కావాలి. మౌలిక సదుపాయాల కల్పన, బ్యాటరీ ఉత్పత్తి, బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ, ఛార్జింగ్‌ సదుపాయాలు... ఇలా ఎన్నో రకాలుగా మార్పులు రావాలి. మా వరకూ మేం పరిస్థితులను గమనిస్తున్నాం. సరైన సమయంలో మేమూ విద్యుత్తు ద్విచక్ర వాహనాలు తీసుకువస్తాం.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్లపై పన్ను రేట్లు యథాతథం'

ఇదీ చూడండి: క్రెడిట్​ స్కోర్​ తగ్గిపోయేందుకు కారణాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.