ETV Bharat / business

గంగా శుద్ధికి ప్రపంచ బ్యాంకు 3 వేల కోట్ల సాయం - గంగా నదీ ప్రక్షాళన

గంగా ప్రక్షాళన కోసం ప్రపంచ బ్యాంకు భారీగా ఆర్థిక సాయం ప్రకటించింది. నమామీ గంగే పేస్​-2 పనుల కోసం రూ.3,023 కోట్లను అందివ్వనుంది. ఈ పథకంలో పలు కీలక ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు ఈ నిధులను భారత ప్రభుత్వం వెచ్చించనుంది.

BIZ-WORLDBANK-GANGA
గంగా శుద్ధి
author img

By

Published : Jul 8, 2020, 5:36 AM IST

మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామి గంగే పథకానికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయానికి ముందుకొచ్చింది. గంగా ప్రక్షాళనకు సంబంధించి రూ.3,023.1 కోట్లు సాయం అందించనుంది.

"రెండో జాతీయ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్ట్ (ఎస్ఎన్​జీఆర్​బీపీ) ద్వారా గంగా నదిలో కాలుష్యాన్ని నివారించడానికి, నదీ పరీవాహక ప్రాంతాల నిర్వహణను బలోపేతం చేయడానికి ఈ నిధులు తోడ్పాటునిస్తాయి" అని ప్రపంచబ్యాంకు మంగళవారం ప్రకటించింది.

ఇందులో రూ. 2,879 కోట్లు రుణంగా అందిస్తుంది ప్రపంచ బ్యాంకు. మిగతా రూ.143 కోట్లు బ్యాంకు గ్యారంటీ కింద వర్తిస్తుందని జాతీయ గంగా ప్రక్షాళన మిషన్​ వెల్లడించింది. ఈ ఒప్పందంపై ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్​, వరల్డ్ బ్యాంకులో భారత ప్రతినిధి కైజర్ ఖాన్​ సంతకం చేశారు.

నిధుల ఖర్చు ఇలా..

ఆగ్రా, మేరఠ్, సహ్రాన్​పుర్​లోని గంగా ఉపనదుల (యమునా, కాళీ)పై కొత్త హైబ్రిడ్ యాన్యుటీ ప్రాజెక్టులకు రూ.1,134 కోట్లు ఖర్చు చేస్తారు.

బక్సర్, ముంగేర్, బెగుసరాయిలోని ప్రాజెక్టులు; దిఘా, పట్నాలోని కంకర్బఘ్, హావ్​డా, బాలీ, బారానగర్ లోని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ ప్రాజెక్టుల్లో కొనసాగుతున్న 'డిజైన్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్' పనులకు రూ.1,209.6 కోట్లను కేటాయిస్తారు.

ఈ నిధులు గంగా ఫేస్​-2 లో సమకూరుతాయి. 2021 డిసెంబర్​ 31తో గంగా ఫేస్-1 పూర్తయ్యాక ఫేస్​-2 మొదలవుతుంది.

ఇదీ చూడండి: ప్రజా భాగస్వామ్యంతోనే నదులకు పునరుజ్జీవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.