భారత్‌లో 2030 నాటికి మహిళా పారిశ్రామికవేత్తలు 15-17 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని గూగుల్, బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ఉద్యోగ వయసున్నమొత్తం జనాభాలో 25 శాతానికి పైగా కొత్త ఉద్యోగాలు మహిళలే సృష్టిస్తారని అందులో తెలిపింది.
భారత్‌లో ఉన్న మొత్తం సంస్థల్లో సుమారు 20 శాతం (1.35-1.57 కోట్లు) సంస్థలు మహిళల ఆధీనంలోనే ఉన్నాయని పేర్కొంది ఈ నివేదిక.
మహిళా పారిశ్రామికవేత్తల చేతిలో ఉన్న సంస్థల ద్వారా ప్రస్తుతం 22 నుంచి 27 మిలియన్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతోందని స్పష్టం చేసింది.