క్లౌడ్ సేవల కోసం 'ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ సర్వీసెస్ పేరిట' విప్రో ప్రత్యేక విభాగాన్ని ప్రకటించింది. ఇప్పటి వరకు సంస్థలో జరుగుతున్న క్లౌడ్ కార్యకలాపాలన్నింటినీ దీని కిందకు తీసుకురానున్నట్లు తెలిపింది. అలాగే క్లౌడ్ సాంకేతికతను సమకూర్చుకోవడంలో భాగంగా భాగస్వామ్యాలు, కొనుగోళ్లు ఉండనున్నాయని స్పష్టం చేసింది. ఇందుకోసం రానున్న మూడేళ్లలో బిలియన్ డాలర్ల(దాదాపు రూ.7.46 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.
క్లౌడ్ సేవల వ్యాపారంలో విప్రో స్థిరమైన వృద్ధి కొనసాగిస్తోందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీలో 79 వేల మంది క్లౌడ్ సాంకేతికతకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది. వీరిలో 10 వేల మందికి లీడింగ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ధ్రువీకరణ ఉందని తెలిపింది. గత 12 నెలల్లో టెలిఫోనికా, ఓ2, మెట్రో ఏజీ వంటి ప్రముఖ సంస్థలతో క్లౌడ్ సేవల ఒప్పందాలు కుదిరాయని వెల్లడించింది.
ఇదీ చదవండి: ఉద్యోగులకు డీఏ పెంపుపై కేంద్రం కీలక ఆదేశాలు