ETV Bharat / business

'వ్యాక్సిన్​ కోసం భారత్​ రూ.80వేల కోట్లు ఖర్చుచేయగలదా?' - కరోనా వ్యాక్సిన్

యావత్​ భారతావని కరోనా వ్యాక్సిన్​ కోసం ఎదురుచూస్తుంటే కొత్త చిక్కులొచ్చిపడుతున్నాయి. టీకా అందుబాటులోకి వచ్చాక దాన్ని కొనుగోలు చేసి, పంపిణీ చేయడం పెద్ద సవాలని అన్నారు వ్యాక్సిన్​ తయారీ సంస్థ సీరమ్​ సీఈఓ అదర్​ పూనావాలా. కొవిడ్​ వ్యాక్సిన్​ను కొనుగోలు చేసి, పంపిణీ చేసేందుకు వచ్చే సంవత్సర కాలానికి రూ. 80 వేల కోట్లను ఖర్చు చేయగలదా.? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.

Will the government have Rs 80,000 crores for Covid vaccine, questions Poonawalla
'వ్యాక్సిన్​ కోసం కేంద్రం రూ.80 వేలకోట్లు ఖర్చుచేయగలదా?'
author img

By

Published : Sep 26, 2020, 7:54 PM IST

కరోనా మహమ్మారి విలయతాండవానికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని కొనుగోలు చేసి, పంపిణీ చేయడం పెద్ద సవాలని ఇప్పటికే చాలామంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్ లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో ఇది క్లిష్టమైన వ్యవహారమని చెప్పారు. తాజాగా ఇదే అంశంపై మాట్లాడారు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా. అంతేకాదు కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రశ్నను సంధించారు.

కొవిడ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి.. వచ్చే సంవత్సర కాలంలో కేంద్రం రూ.80వేల కోట్లను ఖర్చు చేయగలదా?అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్‌ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ.. ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.

POONAWALLA
అదర్​ పూనావాలా ట్వీట్​
POONAWALLA
అదర్​ పూనావాలా ట్వీట్​

''క్విక్‌ క్వశ్చన్‌: వచ్చే ఏడాది కాలంలో భారత ప్రభుత్వానికి రూ.80వేల కోట్లు లభిస్తాయా? భారత్‌లోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ను అందించాలంటే దాన్ని కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి కేంద్రానికి అవసరమైన మొత్తమిది. మనం పరిష్కరించాల్సిన తదుపరి సవాల్​ ఇదే''

- అదర్​ పూనావాలా, సీరమ్​ సంస్థ సీఈఓ

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం కోసం సీరమ్ సంస్థ ఇప్పటికే ఆస్ట్రాజెనికా, నోవాగ్జిన్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ రెండు వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.