ETV Bharat / business

Gold News: దీపావళికి పసిడి వెలుగులు- పెరిగిన గిరాకీ

పండగ సీజన్​లో బంగారం మరోసారి మెరవనుంది. దీపావళిని పురస్కరించుకొని పసిడి (Gold News) కొనుగోళ్లు భారీగా నమోదయ్యే అవకాశం ఉంటుందని నిపుణలు అంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే వేగంగా రికవరీ అవుతుండడం, ధరలూ (Gold Price) తక్కువగా ఉండడంతో గిరాకీ భారీగా పెరగవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

gold
బంగారం
author img

By

Published : Oct 31, 2021, 6:51 AM IST

ఈసారి దీపావళికి బంగారం (Gold News) మరింత మెరవనుంది. కరోనా ముందు స్థాయిలతో పోలిస్తే 30 శాతం వృద్ధితో విక్రయాలు నమోదవుతాయని ఆభరణ తయారీదార్లు విశ్వసిస్తుండడం ఇందుకు కారణం. ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే వేగంగా రికవరీ అవుతుండడం, ధరలూ (Gold Price) తక్కువగా ఉండడంతో గిరాకీ భారీగా పెరగవచ్చని వారు అంచనా వేస్తున్నారు. గతేడాది దీపావళి, ధనత్రయోదశి సమయంలో రత్నాభరణాల పరిశ్రమ దాదాపు సున్నా విక్రయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఎప్పటి నుంచి అంటే..

ఈ క్యాలెండర్‌ ఏడాది మూడో త్రైమాసికం నుంచి పసిడి విక్రయాల్లో వృద్ధి నమోదవుతూ వచ్చింది. 10 గ్రాముల పసిడి రూ.42,500కు తగ్గడం వల్లే ఇది సాధ్యమైందని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి అంటోంది. కరోనా సమయంలో వాయిదా పడ్డ పెళ్లిళ్లు ఈ ఏడాది జరగడమూ కలిసొచ్చింది. ఒకానొక సమయంలో రూ.56,000కు చేరిన బంగారం ఇపుడు రూ.49,200 స్థాయిలో కదలాడుతోంది. టీకా కార్యక్రమం పెరగడం; కరోనా కేసులు తగ్గడంతో ఆర్థిక రికవరీ సాధ్యమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరకల్లా రత్నాభరణాల విక్రయాలు మరింత రాణిస్తాయని, 2019తో పోలిస్తే 20-25% మేర నమోదుకావొచ్చని మండలి అంచనా వేసింది.

జులై-సెప్టెంబరులో..

జులై-సెప్టెంబరులో పసిడి ఆభరణాల గిరాకీ 58% పెరిగి 96.2 టన్నులకు చేరింది. కడ్డీలు, నాణేలపై పెట్టుబడులు కూడా 18% పెరిగాయి. పితృపక్షాల కారణంగా సాధారణంగా స్తబ్దుగా ఉండే ఈ త్రైమాసికం ఫర్వాలేదనిపించగా.. రాబోయే సీజనల్‌ (పండగలు, పెళ్లిళ్లు) గిరాకీ కారణంగా వినియోగదార్లలో ఆసక్తి పెరగవచ్చని డబ్ల్యూజీసీ నివేదికను ఉటంకిస్తూ డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ సోమసుందరమ్‌ అంటున్నారు. ఈ సారి వృద్ధి గతేడాదితో పోలిస్తే కనీసం 35-40% ఉండొచ్చని అంటున్నారు.

12 నెలల్లో 53,000కు

గత దీపావళి నుంచి ఇప్పటిదాకా బులియన్‌ ధరలు స్థిరీకరణలో నడిచాయి. అయితే వచ్చే 12 నెలలపై మాత్రం సానుకూల ధోరణితో ఉన్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంటోంది. మళ్లీ ఔన్సు పసిడి ధర 2000 డాలర్లకు చేరొచ్చని భావిస్తోంది. దేశీయంగా చూస్తే వచ్చే 12 నెలల్లో రూ.52,000-రూ.53,000 గరిష్ఠాలకు చేరొచ్చని అంచనా వేస్తోంది.

ఇదీ చూడండి: World Savings Day: మహిళలూ.. ఇలా పొదుపు చేస్తే మీకు మీరే సాటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.