ఫిబ్రవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. ఆహార ధరల్లో తగ్గుదల కారణంగా గత నెలలో 2.26 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలిసింది.
2020 జనవరిలో డబ్ల్యూపీఐ 3.1 శాతం ఉండగా.. అంతకుముందు ఏడాది 2.93 శాతం నమోదైంది. ఈ ఏడాది జనవరిలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 7.79 శాతం కాగా.. అంతకుముందు నెలలో 11.51 శాతం నమోదైంది.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాలు ఇలా..
- 2020 జనవరిలో ఉల్లి ధరల్లో 293.37 శాతం పెరుగుదల ఉండగా.. ఫిబ్రవరిలో 162.30 శాతానికి పడిపోయింది.
- బంగాళదుంప ధరల్లో జనవరిలో 87.84 శాతం వృద్ధి నమోదు కాగా.. గత నెలలో అది 60.73 శాతానికి దిగొచ్చింది.
- గతేడాది ఆర్థిక సంవత్సరంలో 2.75 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు.. ప్రస్తుత ఏడాదిలో 1.92 శాతంగా నమోదైంది.