ETV Bharat / business

ఇలా చేయకపోతే వాట్సాప్ బంద్!

author img

By

Published : Jan 6, 2021, 8:56 PM IST

ప్రైవసీ పాలసీని వాట్సాప్ అప్​డేట్ చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఈ పాలసీ అమల్లోకి రానుంది. అప్పటిలోగా వినియోగదారులు వీటిని ఆమోదించకపోతే.. వాట్సాప్ వినియోగించుకునే వీలుండదు.

WhatsApp updates terms of service, privacy policy for users
ఇలా చేయకపోతే వాట్సాప్ బంద్!

వాట్సాప్‌ తన ప్రైవసీ పాలసీని తాజాగా అప్‌డేట్‌ చేసింది. ఈ మేరకు వినియోగదారులకు వాట్సాప్ ఓ నోటిఫికేషన్‌ పంపిస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచే వాట్సాప్‌లో ఈ నోటిఫికేషన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తోంది. అప్‌డేట్‌ చేసిన పాలసీని వినియోగదారులు అంగీకరించాలన్నది దాని సారాంశం.

కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం ఫేస్‌బుక్‌ సంబంధిత సర్వీసులతో యూజర్‌ డేటాను వాట్సాప్‌ పంచుకోనుంది. వినియోగదారుల వ్యక్తిగత‌ సమాచారం, డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌, ఐపీ అడ్రస్‌ వివరాలు ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ పంచుకుంటుంది. ఫిబ్రవరి 8 నుంచి ఈ కొత్త ప్రైవసీ పాలసీ అమల్లోకి రానుంది. అప్పటిలోగా దీనిని వినియోగదారులు ఆమోదించాల్సి ఉంది. లేకపోతే వాట్సాప్‌ను వినియోగించుకునే వీలు ఉండదు.

ఇదీ చదవండి: వాట్సప్‌ నుంచి త్వరలో ఆరోగ్య బీమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.