ETV Bharat / business

'కరోనా వ్యాక్సిన్‌కు నాలుగేళ్ల సమయం'

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​కు ఏడాదిలోపు వ్యాక్సిన్​ రావడం ఆసాధ్యమేనన్నారు బయోకాన్​​ సీఎండీ కిరణ్​ మజుందార్​ షా. వ్యాక్సిన్​ వచ్చేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టొచ్చని ఆమె అంచనా వేశారు. అప్పటి వరకు కొవిడ్​-19 విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

corona vaccine may take long time to ready
కరోనా వ్యాక్సిన్​కు నాలుగేళ్లు సమయం
author img

By

Published : May 31, 2020, 7:11 AM IST

కరోనా వ్యాక్సిన్‌ సిద్ధం కావడానికి చాలా సమయం పడుతుందని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అంచనా వేశారు. అందుకే రాబోయే కొన్నేళ్ల పాటు ఈ మహమ్మారి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. ఆరోగ్య సంరక్షణపై మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ఆమె శనివారం జరిగిన ఒక వెబినార్‌లో పేర్కొన్నారు. 'మొత్తం దేశానికి అందుబాటులోకి వచ్చేలా ఒక సురక్షితమైన వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి చాలా కాలం పాటు వేచిచూడాల్సి వస్తుందని మేం భావిస్తున్నాం. ఎందుకంటే వ్యాక్సిన్‌ అభివృద్ధి అనేది చాలా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని మనం అర్థం చేసుకోవాలి. అత్యంత తక్కువ సమయం అనుకున్నా అందుకు నాలుగేళ్లు పట్టవచ్చు' అని మజుందార్‌ షా పేర్కొన్నారు.

కరోనా ఆ విషయాన్ని నొక్కిచెబుతోంది..

'ఒక ఏడాదిలోపు దానిని అభివృద్ధి చేయడం అనేది అసాధ్యమైన పనే. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భద్రత, సామర్థ్యం ఉండాలంటే.. పెద్ద స్థాయిలో పలు ప్రక్రియలు ముడిపడి ఉంటాయి. కాబట్టి నమ్మకమైన వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు కొన్నేళ్ల పాటు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆరోగ్యసంరక్షణపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని ఈ కరోనా మనకు నొక్కిచెబుతోంద’ని ఆమె వివరించారు. ‘ఆరోగ్య సంరక్షణ అనేది మూలధనం అవసరమయ్యే రంగం. నైపుణ్యంతో కూడిన, ఉద్యోగాలను ఇచ్చే రంగం కూడా. ఇపుడు ఆరోగ్య మౌలిక వసతుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక అవకాశం కలిగింది. అదే భారత్‌ను, ప్రపంచాన్ని కాపాడుతుంద’ని అన్నారు.

వైద్య వసతులూ మెరుగవ్వాలి..

అపోలో హాస్పిటల్స్‌ ఎండీ సునీతా రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ‘వైద్య వసతులను మెరుగుపరచుకోవాలని ఈ మహమ్మారి మనకు చెబుతోంది. ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెరగాలి. కేవలం మౌలిక వసతుల్లోనే కాకుండా.. నైపుణ్యాభివృద్ధిలోనూ పెట్టుబడులను పెంచాల’ని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:'తెలివైన లాక్​డౌన్ నిష్క్రమణ వ్యూహం కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.