దాదాపు రెండేళ్ల పాటు సాగిన వాణిజ్య యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా-చైనా దేశాలు నేడు తొలి దఫా ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే అంశమేదీ లేదని తేల్చి చెప్పింది. సుంకాల తగ్గింపు వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాల ప్రతినిధులు కలిసి ఈ అంశంపై సంయుక్త ప్రకటన చేశారు.
చైనా వస్తువులపై బిలియన్ డాలర్ల మేర విధించిన సుంకాలు నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు.. అలాగే అమల్లో ఉంటాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత టారీఫ్‌లు తగ్గించే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఈ వివరణ ఇచ్చింది.
ఇదీ చూడండి: చైనాపై 'కరెన్సీ మ్యానిపులేటర్' ముద్ర తొలగించిన అమెరికా