ETV Bharat / business

కుబేరులు దయతలిస్తే ప్రపంచ ఆకలి తీరుతుందా! - ఆకలి పై పోరాటానికి సంపన్నుల అండ

ప్రపంచ వ్యాప్తంగా ఉండే శ్రీమంతులు తలచుకుంటే ఒక వివిధ దేశాల్లోని కోట్ల మంది నిరుపేదల ఆకలి బాధలు తీర్చేయొచ్చని ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే అంటున్నారు. ఎన్నో రోజులుగా తిండి లేక.. తాగేందుకు నీరు దొరక్క, డొక్క ఎండిపోయి.. చావుకు దగ్గరవుతున్న వారు ప్రపంచంలో 4.2 కోట్ల మంది ఉన్నారట. వీళ్లను బతికిచ్చేందుకు 6 బి.డాలర్లు అవసరమని చెబుతున్నారు.

Elon Musk
ఎలాన్​ మస్క్​
author img

By

Published : Nov 7, 2021, 8:01 AM IST

'నాకు తెలిసిన వ్యక్తి ఒక మంచి మాట చెప్పింది.. మన దగ్గర కావాల్సిన దాని కంటే ఎక్కువ ఉంటే ఒక్కర్ని దత్తత తీసుకోమని. కానీ నా దగ్గర ఉన్నదానితో ఒక్కరు, ఇద్దరిని కాదు.. మొత్తం ఊరునే దత్తత తీసుకుంటా'

- శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబు చెప్పే డైలాగ్‌ ఇది..

అవును శ్రీమంతులు తలచుకుంటే ఒక ఊరిని మార్చడం మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల్లోని కోట్ల మంది నిరుపేదల ఆకలి బాధలూ తీర్చేయొచ్చని అంటున్నారు ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే. ఎన్నో రోజులుగా తిండి లేక.. తాగేందుకు నీరు దొరక్క, డొక్క ఎండిపోయి.. చావుకు దగ్గరవుతున్న వారు ప్రపంచంలో 4.2 కోట్ల మంది ఉన్నారట. వీళ్లను బతికిచ్చేందుకు 6 బి.డాలర్లు (సుమారు రూ.45,000 కోట్లు) అవసరమని ఆయన చెబుతున్నారు. టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ నికర సంపద 300 బి.డాలర్లుగా (సుమారు రూ.22,00,000 కోట్లు) ఉంటుందని అంచనా. ఇందులో కనీసం 2 శాతాన్ని వెచ్చించినా ఆ 4.2 కోట్ల మందిని చావు నుంచి బయటపడేయొచ్చన్నది డేవిడ్‌ బేస్లే అభిప్రాయం. ఒక్క ఎలాన్‌ మస్క్‌ కాదు.. జెఫ్‌ బెజోస్‌.. జుకర్‌ బర్గ్‌.. బిల్‌గేట్స్‌.. ముకేశ్‌ అంబానీ.. ఇలా ప్రపంచంలో దిగ్గజ కుబేరులందరూ తమ సంపదలో కొంత విరాళమిచ్చినా, ఎందరో జీవితాలు మారే అవకాశం ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.

ఇస్తా.. మీ ప్రణాళికేంటో చెప్పండి: మస్క్‌

'ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆకలి బాధలను తీర్చేందుకు 6 బి.డా. కావాలని ఐక్యరాజ్య సమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే అంటున్నారు. వారి ఆకలి బాధలు తీర్చేందుకు మీ ప్రణాళికేంటో చెబితే, నిధులు ఎలా సద్వినియోగం చేస్తారో వెల్లడిస్తే.. 6 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను ఇప్పటికిప్పుడు విక్రయించి, ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ ఏజెన్సీకి ఇచ్చేందుకు నేను సిద్ధమే'నని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. మీరు ప్రస్తుత, ప్రతిపాదిత ఖర్చుల వివరాలను ప్రచురిస్తే.. ఆ డబ్బులు ఎలా ఉపయోగిస్తున్నారో ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. దీనిపై మస్క్‌కు బేస్లే ట్విట్టర్‌ ద్వారా సమాధానమిస్తూ '6 బిలియన్‌ డాలర్లు ప్రపంచ ఆకలి బాధలు తీర్చలేవు. అయితే భోగౌళిక రాజకీయ అస్థిరత్వం, వలసలను నియంత్రించేందుకు సరిపోతాయి. ఇవి పరిష్కారమైతే, 4.2 కోట్ల మంది మరణ అంచుల నుంచి బయటపడతారు' అని తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు ఓసారి కలుద్దామని కూడా ఆయన మస్క్‌కు తెలిపారు.

భారత్‌.. మినహాయింపు కాదు

2021 ప్రపంచ ఆకలి సూచీలో అట్టడుగునున్న దేశం సోమాలియా. 2000 నుంచి ఈ దేశ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. ఇదేకాకుండా యెమెన్‌, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, చాడ్‌, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ద కాంగో, మడగాస్కర్‌, లిబేరియా, హయతి, టిమోర్‌- లెస్టే, సియెరా లియోన్‌, మొజాంబిక్‌ ఆకలి తీవ్రత ఎక్కువగా ఉన్న తొలి 10 దేశాల్లో ఉన్నాయి. 135 దేశాల్లోని పరిస్థితులతో రూపొందించిన ఈ సూచీలో భారత్‌ ర్యాంకు 101 కావడం కూడా ఆందోళన కలిగించే విషయం.

సరైన ప్రణాళిక కావాలి

ఆసియాలోనే అత్యంత సంపన్నుల్లో తొలి రెండు స్థానాలూ మనవాళ్లవే. ప్రపంచవ్యాప్తంగా చూసినా 100 లోపు ర్యాంకుల్లోనూ మనోళ్లు కనిపిస్తారు. అయినప్పటికీ... ఆకలి బాధల సూచీలో మనదేశం దుర్భర స్థితిలో ఉండటం గమనార్హం. బ్లూమ్‌బర్గ్‌ కుబేరుల సూచీ ప్రకారం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ నికర సంపద 100 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.7,50,000 కోట్లు) ఉంటుంది. అదానీ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ నికర సంపద 75 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.5.5 లక్షల కోట్లు). వీళ్లిద్దరి సంపద కలిపితే రూ.13,00,000 కోట్లు. ఇందులో ఒక శాతం.. అంటే రూ.13000 కోట్లు వెచ్చించినా దేశంలోని చాలా మందిని ఆకలి బాధల నుంచి బయటపడేయొచ్చన్నది ఓ విశ్లేషణ. అయితే పటిష్ఠ ప్రణాళికతో వచ్చే వారికి నిధులిచ్చేందుకు కార్పొరేట్‌ కుబేరులు ఎప్పుడూ ముందుంటున్నారు. కొవిడ్‌ సమయంలో కూడా అన్నదానంతో పాటు, వైద్యసేవల్లో ముకేశ్‌ అంబానీతో పాటు ఇతర కార్పొరేట్లు ఎంతగా ఆదుకున్నారో తెలిసిందే. ఇస్కాన్‌ వంటి సంస్థలు ఉన్నత ప్రమాణాల్లో ఆహారాన్ని తక్కువ ఖర్చుతో తయారు చేసి, పేదలకు అందించడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగానికీ సాయం చేస్తోంది. 'కచ్చితమైన ప్రణాళిక లేకుండా దానమివ్వండి.. ఆకలి తీర్చేస్తాం' అంటే.. ఇచ్చేందుకు ఎవరు ముందుకొస్తారు?

ఇదీ చూడండి: పెట్రో పీడనకు సరైన విరుగుడు అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.