ETV Bharat / business

Union budget 2022: నాలుగు స్తంభాలపై రూ.40లక్షల కోట్లు - బడ్జెట్ కేటాయింపులు

Union budget allocations: బడ్జెట్​లో నాలుగు ప్రధాన అంశాలపైనే దృష్టి సారించింది కేంద్రం. వీటితో పాటు ఈ-విద్య, 5జీ, డిజిటల్​ కరెన్సీపై ప్రధానంగా దృష్టి పెట్టింది.

Union budget 2022
కేంద్ర బడ్జెట్​ 2022
author img

By

Published : Feb 2, 2022, 9:52 AM IST

Union budget 2022: కేంద్ర బడ్జెట్‌ మొత్తం అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు. ఇందులో ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లు.

  • మేకిన్‌ ఇండియాలో భాగంగా దేశంలోని 14 రంగాలకు ఉత్పాదకతో ముడిపడిన ఆర్థిక ప్రోత్సాహకాలు. తద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యం
  • స్థానిక సంస్థలకు నష్టం కలగకుండా కస్టమ్స్‌ సంకాల హేతుబద్ధీకరణ
  • దేశీయంగానే తగినంత ఉత్పత్తి సాధించడానికి అవకాశమున్న... వ్యవసాయ, రసాయన, వస్త్ర, వైద్య పరికరాలు, ఔషధ పరిశ్రమలకు ఇస్తున్న 350 రకాల పన్ను మినహాయింపులు క్రమంగా తగ్గింపు
  • నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక. నిర్మాణ రంగంలో సంస్కరణలు
  • కొత్తగా 400 వందేభారత్‌ రైళ్లు, ఇతర రవాణా సదుపాయాలను రైల్వేలతో అనుసంధానిస్తూ రానున్న మూడేళ్లలో 100 గతిశక్తి లాజిస్టిక్‌ టర్మినళ్ల ఏర్పాటు
  • 25 వేల కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల విస్తరణ
  • అన్ని రకాల దీర్ఘకాలిక మూలధన ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను 15 శాతానికి తగ్గింపు. ఇప్పటివరకు అది 37% ఉండేది
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పిన్షన్‌ స్కీం)లో 14% డిడక్షన్‌ వర్తింపు
  • వ్యక్తులు, సంస్థల వద్ద బయటపెట్టని ఆదాయం దొరికినప్పుడు చట్టాల నుంచి ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా పూర్తిగా స్వాధీనం.

Budget allocations

ఈ నాలుగు సూత్రాలే ఆధారం

1.ప్రధాని గతిశక్తి యోజన
2.సమీకృత అభివృద్ధి
3.ఉత్పాదక అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు
4.పరిశ్రమలకు ఆర్థిక ఊతం

ఈ-విద్యకు విశ్వవిద్యాలయం

ప్రధాని ఈ-విద్య కింద ప్రస్తుతం ఉన్న 12 టీవీ ఛానళ్లను 200కు పెంపు. ఉపాధ్యాయుల డిజిటల్‌ నైపుణ్యాల వృద్ధికి శిక్షణ. విద్యార్థులందరికీ అందుబాటులోకి ఈ-కంటెంట్‌. దేశంలో ఈ-విద్య విస్తరణకు డిజిటల్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు.

రానుంది 5జీ

  • దేశవ్యాప్తంగా ప్రైవేటు సంస్థల ద్వారా ఈ ఏడాది అందుబాటులోకి 5జీ సాంకేతికత. మారుమూల ప్రాంతాలకు భారత్‌నెట్‌ ప్రాజెక్టు ద్వారా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌
  • డేటా సెంటర్లు, శక్తి నిలువ వ్యవస్థలకు మౌలిక సదుపాయాల రంగం హోదా

ప్రైవేటుకు అడవులు

అడవుల పెంపకానికి ప్రైవేటు వ్యక్తులకు అవకాశం ఇచ్చేలా... గిరిజనుల కోసం అటవీ పెంపకానికి ప్రత్యేక పథకం.

కేటాయింపులు... సంస్కరణలు

  • రాష్ట్రాలకు చేయూతనిచ్చేందుకు రూ.లక్ష కోట్ల ప్రత్యేక నిధి
  • దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.1.68 లక్షల కోట్లు
  • వరి, గోధుమ సేకరణకు రూ.2.37 లక్షల కోట్లు. చిరుధాన్యాల సంవత్సరంగా 2023
  • ఎంఎస్‌ఎంఈ సంస్థలను ఆదుకునేందుకు రూ.2 లక్షల కోట్లతో ‘రుణ హామీ ట్రస్టు’
  • ప్రతి ఇంటికీ నల్లా పథకం ద్వారా 3.8 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి రూ.60 వేల కోట్లు
  • పీఎం ఆవాస్‌ యోజన కింద 80 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.48 వేల కోట్లు
  • రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు డిఫెన్స్‌ బడ్జెట్‌లోని 68% నిధులు దేశీయ సంస్థలకే ప్రత్యేకం. డీఆర్‌డీవో ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలకు అవకాశం.
  • పర్వతమాల ప్రాజెక్టులో భాగంగా కొండప్రాంతాల అభివృద్ధికి ఎనిమిది రోప్‌వేల నిర్మాణం

డిజి.. డిజి... పరుగులు

  • డిజిటల్‌ ఎకానమీకి ఊతమిచ్చేందుకు 'డిజిటల్‌ రూపీ'ని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ
  • 75 జిల్లాల్లో వాణిజ్య బ్యాంకులకు చెందిన 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల ఏర్పాటు
  • 1.5 లక్షల పోస్టాఫీసుల్లో వాణిజ్య బ్యాంకుల్లో మాదిరే పూర్తి లావాదేవీలకు అవకాశం
  • ఈ ఏడాది నుంచి ఈ-పాస్‌పోర్టు విధానం
  • కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులకు అవకాశం. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌకర్యం.

పర్యావరణానికి ఊతం

  • కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖకు రూ.3,030 కోట్లు
  • పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక గ్రీన్‌ బాండ్లు
  • సోలార్‌ ఫలకల తయారీకి రూ.19,500 కోట్లు.
  • విద్యుత్తు మోటార్ల రంగానికి ఊతమిచ్చేందుకు ఈ-ఛార్జింగ్‌ కేంద్రాల్లో బ్యాటరీలు ఇచ్చిపుచ్చుకునే విధానానికి అనుమతి.
  • బొగ్గు ద్వారా గ్యాస్‌ ఉత్పత్తికి 4 పైలట్‌ ప్రాజెక్టులు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: Union Budget-2022: నిరాశపరచిన నిర్మలమ్మ పద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.