ETV Bharat / business

పర్యటకానికి అత్యంత చెత్త సంవత్సరంగా '2020' - latest UNWTO report

కరోనా కారణంగా 2020 అంతర్జాతీయ ప్రయాణాలు 74శాతం తగ్గిపోయాయని ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యటక సంస్థ వెల్లడించింది. వంద కోట్ల ప్రయాణాలు తక్కువగా జరిగాయని పేర్కొంది. ఫలితంగా 2020 ఏడాది పర్యటక రంగానికి అత్యంత చెత్త సంవత్సరంగా మిగిలిపోయిందని తెలిపింది.

un-world-tourism-organization-confirms-2020-as-worst-year-on-record
2020: పర్యాటకానికి అత్యంత చెత్త సంవత్సరం!
author img

By

Published : Jan 30, 2021, 6:22 PM IST

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటక రంగంపై గతేడాది ఎనలేని ప్రభావం పడింది. రాకపోకలపై నిషేధంతో ఈ రంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో '2020' ఏడాది పర్యటక రంగానికి 'అత్యంత చెత్త సంవత్సరం'గా మిగిలిపోయిందని ఐక్యరాజ్య ప్రపంచ పర్యటక సంస్థ(యూఎన్​డబ్ల్యూటీఓ) వెల్లడించింది. సంస్థ నివేదిక ప్రకారం 2020లో అంతర్జాతీయ పర్యటనలు 74 శాతం తగ్గిపోయాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో వంద కోట్ల ప్రయాణాలు తక్కువగా జరిగాయి.

అంతర్జాతీయ ప్రయాణాలపై పడిన ప్రభావం వల్ల 1.3 ట్రిలియన్ డాలర్ల(రూ.94.78లక్షల కోట్లు) నష్టం వాటిల్లిందని యూఎన్​డబ్ల్యూటీఓ నివేదిక వెల్లడించింది. ఇది 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే 11రెట్లు అధికమని పేర్కొంది. కరోనా సంక్షోభం వల్ల 10-12 కోట్ల ప్రత్యక్ష ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని, అందులో ఎక్కువ శాతం చిన్న-మధ్య శ్రేణి సంస్థల్లోనివేనని తెలిపింది.

టీకాపై ఆశలు!

మహమ్మారి కట్టడి కోసం చాలా దేశాలు ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధించిన విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. సరిహద్దులను పూర్తిగా మూసేశాయని తెలిపింది. తప్పనిసరి కరోనా పరీక్షలు, క్వారంటైన్ వంటి పలు నిబంధనల కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై మరింత ప్రభావం పడిందని పేర్కొంది. కరోనా టీకా అందుబాటులోకి రావడం స్వాగతించదగిన పరిణామం అని చెప్పింది. దీని వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగి, ప్రయాణాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

మరోవైపు, పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడతాయనే విషయంపై సంస్థ సర్వే చేయగా.. 45 శాతం మంది ప్రజలు 2021లోనే అని జావాబు చెప్పారు. పరిస్థితుల్లో మార్పు ఉండదని 25 శాతం మంది, మరింత దిగజారుతాయని 30శాతం మంది పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.