ETV Bharat / business

మోదీ ఆర్థిక ప్యాకేజీపై ఐరాస ఆర్థిక నిపుణుల ప్రశంసలు

భారత ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం స్వాగతించదగిన పరిణామమని ఐక్యరాజ్యసమితి ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా ధాటికి దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలు కలిగించడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. అయితే ఈ ప్యాకేజీ ప్రభావం... ఉద్దీపన రూపకల్పనపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

UN economic experts hail India's 'impressive' stimulus package to revive economy hit by coronavirus
మోదీ ప్యాకేజీపీ ఐరాస ఆర్థిక నిపుణుల ప్రశంసలు
author img

By

Published : May 14, 2020, 4:32 PM IST

కరోనా ధాటికి దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు... ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక నిపుణులు ప్రశంసలు కురిపించారు. భారత ప్రభుత్వ భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడం స్వాగతించాల్సిన పరిణామం అని గ్లోబల్​ ఎకనామిక్ మానిటరింగ్ బ్రాంచ్ చీఫ్ హమీద్​ రషీద్​ వ్యాఖ్యానించారు. 'ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అవకాశాలు' (డబ్ల్యూఈఎస్​పీ) నివేదిక నవీకరణను ప్రారంభించిన ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"భారత్ తన జీడీపీలో 10 శాతాన్ని ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటించింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రకటించిన ప్యాకేజీలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. చాలా దేశాలు తమ జీడీపీలో కేవలం 0.5 శాతం నుంచి 1 శాతం వరకు మాత్రమే ఉద్దీపనలు ప్రకటించాయి. భారత దేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉంది. అలాగే ఈ భారీ ఉద్దీపన ప్యాకేజీని అమలు చేయగల సామర్థ్యమూ ఉంది. అయితే ప్యాకేజీ ప్రభావం ఉద్దీపన రూపకల్పనపై ఆధారపడి ఉంటుంది."

- హమీద్ రషీద్, గ్లోబల్​ ఎకనామిక్ మానిటరింగ్ బ్రాంచ్ చీఫ్

ఆకట్టుకునేలా ఉంది.. కానీ..

యూఎన్ డీఈఎస్​ఏ... అసోసియేట్ ఎకనామిక్ అఫైర్స్ అధికారి జూలియన్ స్లాట్మన్​... భారత్ ప్యాకేజీ ఆకట్టుకునేలా ఉందని వ్యాఖ్యానించారు.

"మార్కెట్లకు భరోసా ఇవ్వడానికి, దేశీయ వినియోగాన్ని పెంచడానికి ఈ భారీ ప్యాకేజీ దోహద పడుతుంది. అదే సమయంలో ప్రజలు ఖర్చు చేయడానికి వెనుకాడితే మాత్రం.. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం చాలా కష్టమవుతుంది."- జూలియన్ స్లాట్మన్

కరోనా వ్యాప్తి సాపేక్షంగా తక్కువగా ఉన్నప్పుడు, భారత్​ కఠినమైన లాక్​డౌన్ అమలు చేయడం ప్రశంసించదగ్గ విషయమని జూలియన్ స్లాట్మన్ అన్నారు. అయితే ఆంక్షలు క్రమంగా తొలగించడం అనివార్యమని పేర్కొన్నారు. అయితే అనవసరంగా తొందరపడకూడదని సూచించారు. అంటువ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత్ లాక్​డౌన్ వల్ల అసంఘటిత రంగంలోని కార్మికులు, మహిళలు తీవ్రంగా దెబ్బతిన్నారని స్లాట్మన్ అన్నారు.

అగ్రదేశాల సరసన..

ప్రపంచంలోనే అతి పెద్ద ఉద్దీపన ప్యాకేజీని అమెరికా ప్రకటించింది. అయితే అది ఆ దేశ జీడీపీలో 13 శాతం మాత్రమే. జపాన్ మాత్రం తన జీడీపీలో 21 శాతాన్ని ఆర్థిక ఉద్దీపనలకు ఖర్చు చేస్తోంది. వీటి తరువాత అంత పెద్ద ఉద్దీపన ప్యాకేజీ (జీడీపీలో 10 శాతం) భారత్​దే.

ప్రధాని నరేంద్ర మోదీ 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' పేరుతో రూ.20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని మంగళవారం ప్రకటించారు. కరోనా దెబ్బ నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుని... భారతదేశం స్వయం సమృద్ధి సాధించడమే దీని లక్ష్యం. చిన్న వ్యాపారాలకు పన్ను మినహాయింపు, దేశీయోత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.

క్షీణించిన వృద్ధి

కరోనా దెబ్బకు ప్రపంచమంతటా ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. కనిపించని ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని వెన్నాడుతోంది. మొత్తంగా చూసుకుంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020-21లో దాదాపు 8.5 ట్రిలియన్ డాలర్ల ఉత్పత్తిని కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ జీడీపీ 3.2 శాతం తగ్గుతుందని డబ్ల్యూఈఎస్​పీ నివేదిక అంచనా వేసింది.

భారత్​ విషయానికి వస్తే.... 2020-21 సంవత్సరానికి గాను దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 1.2 శాతానికి తగ్గించింది డబ్ల్యూఈఎస్​పీ నివేదిక. అయినప్పటికీ ప్రపంచంలో చైనా (1.7 శాతం జీడీపీ వృద్ధి రేటు) తరువాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది.

మరోవైపు అగ్రదేశాల ఆర్థిక వ్యవస్థలు కుచించుకుపోతున్నాయి. అమెరికా (-4.8 శాతం), జపాన్ (-4.2 శాతం), యూరోపియన్ యూనియన్​ (-5.5 శాతం), యూకే (-5.4 శాతం) క్షీణిస్తున్నాయి.

ఇదీ చూడండి: ఎస్​ఎంబీల కోసం మైక్రోసాఫ్ట్​​ 'బ్యాక్​2బిజినెస్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.