ETV Bharat / business

600 మంది 'ఉబర్' ఉద్యోగులకు ఉద్వాసన

author img

By

Published : May 26, 2020, 12:21 PM IST

ఉబర్​ ఇండియా 600 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా 6,700 మందికి ఉద్వాసన పలికింది. కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ వల్ల తీవ్రంగా నష్టపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. మరోవైపు టీవీఎస్ మోటార్​ కంపెనీ​.. తన ఉద్యోగుల జీతాల్లో 20 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Uber India lays off around 600 employees
600 మంది 'ఊబర్' ఉద్యోగులకు ఉద్వాసన

కరోనా సంక్షోభం కారణంగా 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉబర్ ఇండియా ప్రకటించింది. సంస్థ నష్టాల్లో ఉన్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది.

"కరోనా, లాక్​డౌన్​ల వల్ల సంస్థకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగింది. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మా ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సి వచ్చింది. ప్రస్తుతానికి డ్రైవర్లు, ఇతర ఉద్యోగులు సహా 600 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాం."

- ప్రదీప్ పరమేశ్వరన్, ఉబర్స్ ఇండియా అండ్ సౌత్ ఏషియా బిజినెస్ ప్రెసిడెంట్​

విచారకరమే గానీ..

ఈ నెల మొదట్లో... ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలోని పలువురు ఉద్యోగులను తొలగించనున్నట్లు ఉబర్​ ప్రకటించింది. అందులో భాగంగానే తాజాగా ఉద్యోగులను తొలగించినట్లు పరమేశ్వరన్ తెలిపారు.

"ఉబర్ కుటుంబం నుంచి కొంత మంది సహోద్యోగులు బయటకు వెళ్లడం చాలా విచారకరం. అయితే మేము భవిష్యత్తు​లో రాణిస్తామనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాం."

- ప్రదీప్ పరమేశ్వరన్, ఉబర్స్ ఇండియా అండ్ సౌత్ ఏషియా బిజినెస్ ప్రెసిడెంట్

10 వారాల జీతం

తాజాగా తొలగించిన ఉద్యోగులకు సుమారు 10 వారాల జీతం, రానున్న 6 నెలలకు వైద్య బీమా కవరేజీ, అవుట్​ ప్లేస్​మెంట్ సపోర్టు ఇచ్చినట్లు ఉబర్ వెల్లడించింది.

ఉద్యోగాలు పోతున్నాయ్​..

కొద్దిరోజుల క్రితం ఓలా.. 1400 మంది ఉద్యోగులను తొలగించింది. గత రెండు నెలల్లో 95 శాతం ఆదాయం పడిపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. తాజాగా ఉబర్ తన ఉద్యోగులను తొలగించింది.

జీతాలు తగ్గింపు

ద్విచక్ర వాహన కంపెనీ టీవీఎస్ మోటార్..​​​ తాత్కాలికంగా తమ ఉద్యోగుల జీతాల్లో 20 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దిగువ స్థాయి ఉద్యోగులను (ఎంట్రీ లెవల్ వర్క్​మెన్)​ను మినహాయించి, ఎగ్జిక్యూటివ్ స్థాయిలోని ఉద్యోగుల జీతాలు 20 శాతం మేరకు తగ్గనున్నాయి. ఈ మే నుంచి అక్టోబర్ వరకు అంటే 6 నెలలపాటు ఈ తగ్గింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

"జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 5 శాతం, సీనియర్ మేనేజ్​మెంట్​ స్థాయిలో 15 నుంచి 20 శాతం వరకు జీతాల తగ్గింపు ఉంటుంది." - టీవీఎస్ మోటార్​ కంపెనీ అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: ఎంఎస్​ఎంఈలకు రూ.5 లక్షల కోట్ల బకాయిలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.