ETV Bharat / business

శాంసంగ్ రోలింగ్ ఫోన్‌ను చూశారా?

శాంసంగ్​ నుంచి త్వరలో రానున్న రెండు మడతల ఫోన్​, రోలింగ్​ డిస్​ప్లే ఫోన్లు ఎలా ఉంటాయో తెలుసా? ఈ ఫోన్లకు సంబంధించిన యానిమేటెడ్​ ఫొటోలు శాంసంగ్​ డిస్​ప్లే వెబ్​సైట్లో దర్శనమిచ్చాయి.

samsung Folding phone
శాంసంగ్ రోలింగ్ ఫోన్‌
author img

By

Published : Nov 28, 2020, 5:48 AM IST

ఎప్పట్నుంచో శాంసంగ్‌ రెండు మడతల ఫోన్‌తో పాటు రోలింగ్‌ డిస్‌ప్లేతో ఫోన్లు తీసుకొస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. అప్పుడప్పుడు ఫోన్ ఇలానే ఉంటుందంటూ కొన్ని డ్రాయింగ్స్‌ నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా శాంసంగ్ కంపెనీ త్వరలో విడుదల చేయబోయే రెండు మడతల ఫోన్, రోలింగ్ డిస్‌ప్లే ఫోన్లకు సంబంధించిన యానిమేటెడ్ ఫొటోలు శాంసంగ్‌ డిస్‌ప్లే వెబ్‌సైట్లో దర్శనమిచ్చాయి. దాని ప్రకారం రెండు మడతల ఫోన్ స్క్రీన్‌ పూర్తిగా తెరిచినప్పడు ట్యాబ్‌ స్క్రీన్‌లా మారిపోతుంది. తిరిగి దాన్ని మడతబెడితే సాధారణ ఫోన్ స్క్రీన్‌ తరహాలోనే ఉంటుంది. ఫొటోలో ఉన్న దాన్ని బట్టి ఈ ఫోన్‌లో ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.

ఇక రోలింగ్ డిస్‌ప్లే ఫోన్‌ను చిన్నపాటి కంప్యూటర్‌ ఉపయోగించుకోవచ్చు. ఇందులో కూడా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. సిలిండర్‌ ఆకృతిని పోలిఉండే స్టిక్‌లో నుంచి రోలింగ్ డిస్‌ప్లే బయటికి వచ్చినట్లు ఉంది. స్క్రీన్‌లో సగభాగం డిస్‌ప్లేలా, మిగిలిన భాగం కీబోర్డులా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో వీటిని మార్కెట్లోకి విడుదల చేయాలని శాంసంగ్‌ భావిస్తోందట.

ఇదీ చూడండి:'అంచనాలను మించి పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.