దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్.. కొత్త వెర్షన్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వేరియంట్ ధర (దిల్లీ ఎక్స్ షోరూం) రూ.1.31 లక్షలుగా నిర్ణయిచింది.
200 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్.. స్పోర్ట్, అర్బన్, రెయిన్ రైడింగ్ మోడ్లతో అందుబాటులోకి వచ్చింది.
ఈ బైక్ డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్, అడ్జస్టబుల్ సస్పెన్షన్, మెరుగైన బ్రేక్ పనితీరును పొందుపరిచింది కంపెనీ. గ్లోస్ బ్లూ, పెరల్ వైట్, మెట్ బ్లూ రంగుల్లో ఈ బైక్ను అందుబాటులోకి తెచ్చింది టీవీఎస్
ఇదీ చూడండి:ఈ బుర్ర లేని రోబో భలే హెల్ప్ చేస్తుంది గురూ!