ETV Bharat / business

2020లో 9 శాతం పెరిగిన టీవీ వ్యూయర్​షిప్​ - దేశంలో 2020లో టీవీ వీక్షణలు

గతేడాది దేశంలో టీవీ చూసే సమయం భారీగా పెరిగింది. వారంలో వీక్షణ సమయం 9 శాతం పెరిగి, 999 బిలియన్ల నిమిషాలుగా నమోదైంది. ప్రతివ్యక్తి ఒక్కరోజు టీవీ వీక్షించే సగటు సమయం 4 గంటల 2 నిమిషాలుగా ఉంది. కరోనాతో విధించిన లాక్​డౌన్​ వల్ల టీవీ చూసే సమయం భారీగా పెరిగిందని బార్క్​ తెలిపింది.

TV viewership
2020లో 9 శాతం పెరిగిన టీవీ వ్యూయర్​షిప్​
author img

By

Published : Mar 2, 2021, 5:20 AM IST

భారత్​లో కరోనా మహమ్మారి కారణంగా గతేడాది టెలివిజన్​ వ్యూయర్​షిప్​(వీక్షణలు) భారీగా పెరిగిందని బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్ రీసెర్చ్​ కౌన్సిల్​(బార్క్​) తెలిపింది. వారంలో టెలివిజన్​ చూసే సమయం 9 శాతం పెరిగి 999 బిలియన్ల నిమిషాలకు చేరిందని వెల్లడించింది.

2019లో ఒకరోజులో ప్రతి వ్యక్తి సగటు వీక్షణ సమయం 3 గంటల 42 నిమిషాలు ఉండగా.. 2020లో అది 4 గంటల 2 నిమిషాలకు పెరిగిందని బార్క్​ తెలిపింది. లాక్​డౌన్​తో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల టీవీ వీక్షణ సమయం గణనీయంగా పెరిగిందని చెప్పింది.

ఏవేవి? ఎంతెంత?

  • సాధారణ వినోద ఛానెళ్లను చూసే నిమిషాలు 9 శాతం పెరిగాయి. సినిమాలు- 10 శాతం, పిల్లల ఛానెళ్లు- 27 శాతం పెరిగాయి.
  • మ్యూజిక్​ ఛానెళ్లు చూసే నిమిషాలు(- 11 శాతం), క్రీడ ఛానెళ్లు(-35 శాతం) తగ్గాయి.

మార్చిలో టీవీ వీక్షణలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని బార్క్ సీఈఓ సునీల్ లుల్లా చెప్పారు. రామాయణం, మహాభారతం వంటి పౌరాణిక క్లాసిక్‌లకు అధిక వీక్షణలు దక్కాయని చెప్పారు. ప్రపంచంలో అత్యధికంగా వీక్షణలు పొందిన టీవీ ప్రోగ్రామ్​గా 'రామాయణం' రికార్డు సాధించిందని తెలిపారు.

జనతా కర్ఫ్యూ కారణంగా జనవరి- మార్చితో పోల్చితే.. మార్చి నుంచి జూన్​ మధ్య టీవీ చూసే సమయం 23 శాతం పెరిగిందని బార్క్​ చెప్పింది. 2020లోని 12వ వారంలో టీవీ వార్తల వీక్షణలు 206 బిలియన్ల నిమిషాలుగా నమోదైందని తెలిపింది.

ఇదీ చదవండి:స్పెక్ట్రమ్‌ వేలంలో తొలిరోజు రూ. 17,146 కోట్ల బిడ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.