రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారాన్ని పూర్తిగా విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ.లక్షా 10 వేల కోట్లు జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసినట్లు వెల్లడించింది. 20వ విడతలో రాష్ట్రాలకు రూ. 4 వేల 140 కోట్లు అందించినట్లు తెలిపింది. దీంతో పరిహారం చెల్లింపు 100 శాతం పూర్తయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు నష్టపోయిన లోటును పూడ్చేందుకు కేంద్రం, ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారానే విడతల వారీగా పరిహారాన్ని విడుదల చేసింది.
2020 అక్టోబర్ 23 నుంచి 20 వారాల్లో 20 విడతలను చెల్లించింది.
ఇదీ చదవండి : రాజ్యసభ ముందుకు బీమా చట్ట సవరణ బిల్లు