ETV Bharat / business

financial planning advisors: విద్యా సంస్థలు తీర్చలేని లోటు... యూట్యూబ్‌ తీర్చుతూ.. - యూట్యూబ్​లో ఫైనాన్షియల్​ పాఠాలు

మనదేశంలో అక్షరాస్యులు 70 శాతానికి పైనే! కానీ ఆర్థిక అక్షరాస్యులు మాత్రం 27 శాతమే. విద్యా సంస్థలు తీర్చలేని ఈ లోటుని కొందరు వ్యక్తులు తమ యూట్యూబ్‌ పాఠాలతో తీర్చుతున్నారు. తద్వారా లక్షలు సంపాదిస్తున్నారు!

financial planning advisors
financial planning advisors
author img

By

Published : Oct 24, 2021, 11:34 AM IST

రచనా టీచర్‌

లక్షలమంది విద్యార్థులు!

పుణెకు చెందిన రచనా రణడే సీఏ చేసి ఆపైన టీచర్‌గా మారి సీఏ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. కీలకమైన స్టాక్‌ మార్కెట్‌ గురించి పాఠం చెప్పినపుడు తన విద్యార్థుల్లో చాలామంది ఆరోజు క్లాసుకు రాలేదని చెప్పారట. దాంతో వారికోసం ‘బేసిక్స్‌ ఆఫ్‌ స్టాక్‌మార్కెట్‌’ వీడియో చేసి తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పెట్టారు. 2009 నుంచీ ఆమె అడపాదడపా సీఏ పాఠాల్ని యూట్యూబ్‌లో పెడుతూ వచ్చారు కానీ, స్టాక్‌ మార్కెట్‌పైన వీడియోకి అనూహ్యమైన స్పందన వచ్చింది. యువ మదుపర్లకు స్టాక్‌మార్కెట్‌పైన ఉన్న ఆసక్తిని గమనించి 2019 నుంచి వరసగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల గురించి వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు. ఏడాదిన్నరలో 10 లక్షల సబ్‌స్క్రైబర్లనీ, ఆపైన ఏడు నెలల్లో 20 లక్షల సబ్‌స్క్రైబర్లనీ చేరుకున్నారు. అప్పట్నుంచీ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం గురించి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. ‘భారతీయులకు పొదుపు చేయడం అలవాటు. ఆ డబ్బుని ఫిక్సెడ్‌ డిపాజిట్లు, బంగారం, స్థలం కొనడం లాంటి పద్ధతుల్లో ఇన్వెస్ట్‌ చేసేవారు. లాక్‌డౌన్‌ కారణంగా వారు తమ ఆర్థిక ప్రణాళికల గురించి ఆలోచించడానికి సమయం దొరికింది. జీతాల్లో కోత, ఉద్యోగాలు కోల్పోవడంవల్ల వారు కొత్త ఆదాయ మార్గాల్ని అన్వేషించాల్సి వచ్చింది. దాంతో స్టాక్‌మార్కెట్‌ గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్‌ని ఆశ్రయిస్తున్నారు’ అని చెబుతారు రచన. బుధ, శని వారాల్లో వీడియోల్ని కచ్చితంగా పోస్ట్‌ చేస్తారు. వారానికో లైవ్‌ సెషన్‌ పెడుతూ వీక్షకుల సందేహాల్ని తీరుస్తారు. ప్రస్తుతం 30 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ‘rachanaranade.com’ ద్వారా ఆర్థిక అంశాలపైన కోర్సుల్నీ అందిస్తున్నారు.

అనుభవాలే పాఠాలుగా!

రాజ్‌ షమానీ, వ్యాపారవేత్త

ఇందోర్‌కు చెందిన రాజ్‌ షమానీ, వ్యాపారవేత్త, మోటివేషనల్‌ స్పీకర్‌, యూట్యూబర్‌... 23 ఏళ్లకే ఇన్ని పాత్రలు పోషిస్తున్నాడు. రాజ్‌ తండ్రి పరిశ్రమలకు రసాయనాల్ని అందించే చిరు వ్యాపారి. అనారోగ్యం కారణంగా తండ్రి ఇంటికి పరిమితమవడంతో 16 ఏళ్లకే కుటుంబ వ్యాపార బాధ్యతలు తీసుకున్నాడు రాజ్‌. తండ్రి కంటే ఎక్కువ ఉత్పత్తులు తెచ్చి తగ్గింపు ధరలకు అమ్ముతూ కొత్త ఖాతాదారుల్ని చేరుకోగలిగాడు. తర్వాత లాండ్రీ వ్యాపారంలోకి అడుగుపెట్టి మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తున్నాడు. 2015లో ఐక్యరాజ్య సమితిలో ‘యంగ్‌ లీడర్స్‌’ పేరుతో జరిగిన సదస్సులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత టెడ్‌ ఎక్స్‌ స్పీకర్‌గా మారి 26 దేశాల్లో 200 స్పీచ్‌లు ఇచ్చాడు. కొవిడ్‌ సమయంలో పారిశుద్ధ్యం, వ్యక్తిగత శుభ్రత విభాగంలో కొత్త ఉత్పత్తుల్ని తెచ్చి వ్యాపారాన్ని రూ.200 కోట్ల టర్నోవర్‌ స్థాయికి తీసుకువెళ్లాడు. తన విజయమే ఉదాహరణగా ఆర్థిక అంశాలపైన సూచనలూ, సలహాలూ ఇస్తూ వీడియోల్ని యూట్యూబ్‌లో పంచుకోవడం మొదలుపెట్టాడు. రాజ్‌కి ఇన్‌స్టాలో పది లక్షలకు పైగా ఫాలోయర్స్‌, యూట్యూబ్‌లో లక్షకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. త్వరలోనే పుస్తకాన్నీ తేబోతున్నాడు. తన అనుభవాల్ని చెప్పడమే కాదు ఆర్థిక నిపుణులతో, యువ వ్యాపారులతో ఇంటర్వ్యూలూ చేస్తుంటాడు. ‘సోషల్‌ మీడియాలో విజయం సాధించాలంటే.. ఏ సంస్థ అయినా కొత్తగా ఫీచర్‌ తెస్తే దాన్ని అందరికంటే ముందు ఉపయోగించి ప్రయోజనం పొందాలి, తరచూ వీడియోలు పెడుతుండాలి’ అని చెబుతాడు.

లాయర్‌ చెప్పే ఆర్థిక పాఠాలు..

ప్రొంజల్‌ కమ్రా

రాయ్‌పూర్‌కు చెందిన ప్రొంజల్‌ కమ్రా... ఎల్‌ఎల్‌బీ చేశాడు. కానీ, క్లాసులో ఉన్నపుడే అతనికి అర్థమైంది తన భవిష్యత్తు అది కాదని. స్టాక్‌ మార్కెట్‌ ప్రత్యామ్నాయంగా కనిపించింది. తండ్రి దగ్గర రూ.20 వేలు తీసుకుని షేర్లలో మదుపు చేశాడు. అతడు కొన్న టీవీఎస్‌ షేర్లు ఏడాదిలో తొమ్మిది రెట్లు లాభాల్ని తెచ్చినా, మిగతావన్నీ నష్టాలే మిగిల్చాయి. మార్కెట్‌ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుని... ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ మార్కెట్స్‌’ నుంచి ఏడాది వ్యవధి ఉండే పీజీ కోర్సు చేశాడు. తాను మదుపు చేస్తూనే, మార్కెట్‌లో కొత్తగా వచ్చేవాళ్లకి యూట్యూబ్‌లో పాఠాలు చెప్పాలనుకున్నాడు. అక్కడ ఏడాది వ్యవధిలో 60 వరకూ వీడియోలు పెట్టాడు. కానీ అనుకున్నంతగా స్పందన రాలేదు. తర్వాత చేసిన మరో రెండు వీడియోలతో సబ్‌స్క్రైబర్లు పెరిగారు. వాటిలో ‘హౌ కెన్‌ బిగినెర్స్‌ స్టార్ట్‌ ఇన్వెస్టింగ్‌?’ వీడియోకి 50 లక్షల వీక్షణలు వచ్చాయి. ప్రస్తుతం 30 లక్షలకుపైన సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. క్లాసులో అందరికంటే తక్కువ మార్కులు వచ్చే విద్యార్థికీ పాఠం అర్థం అయ్యేలా చెప్పడమే తన విధానం అంటాడు. వీడియో పాఠాలు చెబుతూనే, కొత్తగా మార్కెట్‌లో అడుగుపెట్టేవారికి ఆన్‌లైన్లో ‘ఫినాలజీ’ కోర్సునీ తెచ్చాడు. ఇదంతా రాయ్‌పూర్‌ నుంచే చేస్తున్నాడు.

ఇదీ చూడండి: Stock Market today: వారాంతంలోనూ మార్కెట్లకు నష్టాలే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.