ETV Bharat / business

ప్రివ్యూ 2020: దేశార్థికం ఊతానికి ముందున్నవి 3 సవాళ్లు - Emerging diseases

దేశంలో అధిక వినియోగం, వృద్ధి లక్ష్యాల సాధనకు మూడు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. దేశ వినియోగ భవిష్యత్తు కోసం సానుకూల దృక్పథాన్ని సాధించడం మూడు క్లిష్టమైన సవాళ్లపై ఆధారపడి ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 2019 జనవరిలో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆ సవాళ్లివే... 1. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన 2. గ్రామీణ భారతంలో సామాజిక ఆర్థిక సమ్మిళితం 3. ఆరోగ్యకరమైన, సుస్థిర భవిష్యత్తు. ఈ మూడు సవాళ్ల పురోగతి తీరును నిశితంగా పరిశీలించాలి. ఏడాది వ్యవధిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధినీ విశ్లేషించాలి.

to-be-a-nationalist-dot-dot-dot-the-three-challenges-ahead
దేశార్థికం గాడినపడాలంటే... ముందున్నవి మూడు సవాళ్లు
author img

By

Published : Dec 28, 2019, 6:36 AM IST

Updated : Dec 28, 2019, 7:02 AM IST

త్రైమాసికంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు క్షీణిస్తోంది. 2018-19 తొలి త్రైమాసికంలో 8.0 శాతంగా ఉన్న వృద్ధిరేటు అయిదు శాతానికి తగ్గింది. 2019-20 రెండో త్రైమాసికంలో అది 4.5 శాతానికి చేరింది. ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక 2019లో భారత జీడీపీ వృద్ధిరేటు దాదాపు 7.5 శాతం వరకు ఉండొచ్చని, అది ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకశక్తిలా పని చేస్తుందని పేర్కొంది. ఆ అంచనాలకు విరుద్ధంగా 2019-20లో జీడీపీ వృద్ధి అయిదు శాతంకన్నా తక్కువగానే ఉండొచ్చనేది తాజా అంచనా. ఏడాది కాలంలో మందగమనానికి ప్రపంచస్థాయి అంశాలే కాకుండా జీఎస్టీ, బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (సుమారు రూ.10 లక్షల కోట్లు), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) సంక్షోభం, కుంగిన వ్యవసాయ వృద్ధి, గ్రామీణ ఆదాయాల క్షీణత... వంటివి కారకాలుగా నిలిచాయి. ‘భారత ఆర్థిక వ్యవస్థ అత్యవసర చికిత్స విభాగం (ఐసీయూ)లో ఉంది. ప్రస్తుతానికిది మందగమనానికి సంకేతమే తప్ప, మాంద్యం బారిన పడలే’దన్నది కొందరు ఆర్థికవేత్తల అంచనా. ఈ విషయంలో ఆందోళన అనవసరమన్న వాదనలూ లేకపోలేదు. ఏదేమైనా మరో ఏడాది గడిస్తే తప్ప పునరుద్ధరణకు గల అవకాశాల గురించి చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.

నైపుణ్యాభివృద్ధి కీలకం

ప్రపంచ ఆర్థిక వేదిక ప్రస్తావించిన మొదటి సవాలు- నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన అంశం. 2017-18 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదికలో ఉద్యోగితకు సంబంధించిన పలు అంశాలున్నాయి. ఈ వ్యవధిలో దేశ నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల అత్యధిక స్థాయితో 6.1 శాతానికి చేరింది. మహిళల్లో పని భాగస్వామ్య రేటు 2004-05లో 42 శాతం. అది 2017-18లో 22 శాతానికి తగ్గింది. ఇప్పటికీ అసంఘటిత రంగంలో 85 నుంచి 90 శాతం వరకు కార్మికులున్న నేపథ్యంలో ప్రభుత్వం సంఘటిత రంగాన్ని విస్తరించడంపై దృష్టి సారించాలి. అసంఘటిత రంగం ఉత్పాదకతనూ పెంచాలి. జనాభా పెరుగుదలవల్ల శ్రామిక శక్తికి పెద్ద సంఖ్యలో ప్రజలూ తోడవుతారు. వారికి విద్య, నైపుణ్యాల్ని అందజేసినప్పుడే తగిన ఉద్యోగాలు దక్కి ప్రయోజనాలు సమకూరుతాయి. ఈ ప్రయోజనాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటాయి. ఇక ఇతర దేశాల్లో 70 నుంచి 80 శాతం యువతకు అధికారికంగానే వృత్తి నైపుణ్య శిక్షణ అందుతోంది.

మనదేశంలో కేవలం 2.3 శాతం శ్రామికులకే ఆ తరహా శిక్షణ లభిస్తోందని నీతిఆయోగ్‌ చెప్పడం- దేశంలో నైపుణ్యాభివృద్ధి మందకొడితనానికి నిదర్శనం. భారత నైపుణ్యాభివృద్ధి రంగంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రైవేటు పరిశ్రమలు పెద్దయెత్తున భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలూ నైపుణ్యాభివృద్ధి మిషన్లను ఏర్పాటు చేశాయి. నైపుణ్య సాధనలో 17 కేంద్ర మంత్రిత్వ శాఖలు కార్యక్రమాల్ని చేపట్టాయి. ఒకవైపు ఇంత కృషి జరుగుతున్నా, వాటిని వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభావశీలంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. నైపుణ్యాభివృద్ధిలో చైనా అనుభవాల నుంచి భారత్‌ అనేక పాఠాలు నేర్చుకోగల వీలుంది. 1996లో చైనా తెచ్చిన వృత్తివిద్యాచట్టం ఆ దేశ సాంకేతిక, వృత్తివిద్య, శిక్షణ వ్యవస్థలో మైలురాయిగా నిలిచిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నైపుణ్య సంస్థలు, పరిశ్రమలపై నిర్దిష్ట బాధ్యతల్ని నిర్దేశించేలా భారత్‌లో నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ కోసం ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలి.

ఆదాయాలు, వేతనాల్లో మందగమనం

సామాజిక, ఆర్థిక సమ్మిళితాభివృద్ధి గ్రామీణ భారతానికి చేరడం రెండో సవాలు. ఏడాదిగా గ్రామీణ ఆదాయాలు, వేతనాల్లో మందగమనం కనిపిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాల్ని పూడ్చాల్సి ఉంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, అంతర్జాలం అందుబాటులోకి తేవడం, ఆర్థిక సమ్మిళితం విషయంలో ఈ అంతరాలు తగ్గాలి. మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం అయిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు ప్రకటించడం ముఖ్యమైన చర్య. ఈ నిధుల్ని వ్యయపరచే క్రమంలో ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై మరింతగా దృష్టి సారించడం మంచిది. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఎల్పీజీ కనెక్షన్లతో వంటగ్యాస్‌ను అందుబాటులోకి తెచ్చే ఉజ్వల యోజన; విద్యుత్తును అందించే సౌభాగ్య యోజన, స్వచ్ఛభారత్‌ అభియాన్‌ వంటి కార్యక్రమాల ద్వారా సేవలు అందించింది. ఇవి బాధిత వర్గాలకు ముఖ్యంగా మహిళలకు ఎంతగానో తోడ్పడ్డాయి. 2022నాటికి ప్రతి కుటుంబానికీ విద్యుత్తు, వంటగ్యాస్‌ సౌకర్యం అందిస్తామని 2019 బడ్జెట్‌ వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో ఈ పథకాల పురోగతి తీరును గమనించాల్సి ఉంది.

పెచ్చరిల్లుతున్న వ్యాధులు

ప్రపంచ ఆర్థిక నివేదిక ప్రస్తావించిన మూడో సవాలు- ఆరోగ్యకరమైన, సుస్థిర భవిష్యత్తు. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జనాభా పెరుగుదల కట్టుతప్పింది. పట్టణ ప్రాంతాల్లో ప్రజల రద్దీ, కాలుష్యం రేటు ఆందోళన కలిగిస్తోంది. సాంక్రామికేతర వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయి. దేశంలో అన్ని రకాల మరణాల్లో 63 శాతం వాటా వీటిదేనని అంచనా. ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎమ్‌జేఏవై) కార్యక్రమం అమలుపై దృష్టి సారించింది. ఇందులో పది కోట్ల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల మేర ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తారు. ఈ కార్యక్రమం కోసం లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. అవసరమైన నిధులతో పోలిస్తే, పీఎమ్‌జేఏవైకు చేసిన కేటాయింపులు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ కవరేజీలో ఆరోగ్య బీమా ముఖ్యమైన అంశమనేది నిర్ద్వంద్వం. సార్వజనీన ఆరోగ్య కవరేజీ కోసం ఆరోగ్యరంగంపై ప్రభుత్వ వ్యయంలో భారీ పెరుగుదల, ప్రాథమిక ఆరోగ్య రంగం మౌలిక సదుపాయాల్ని సంపూర్ణంగా ప్రక్షాళించాల్సిన అవసరం ఉంది.

సమస్యలు అనేకం

వాయు, నీటి కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ, పట్టణాల్లో రద్దీ వంటి అంశాల్లో తలెత్తే సంక్షోభాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాలుష్యం స్థాయుల్ని తగ్గించేందుకు, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇటీవలే ప్రభుత్వం పలు చర్యల్ని తీసుకుంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు నమామి గంగే మిషన్‌ ఓ ఉదాహరణ. ప్రస్తుతం దేశంలో ఉన్న పర్యావరణ నిబంధనలు, ప్రపంచంలో అమలులో ఉన్న కఠిన చట్టాలకు దీటుగా ఉన్నాయి. అమలు తీరే ఆశాజనకంగా లేదు. దీనివల్ల వాయు, నీటి కాలుష్యాలు పెచ్చరిల్లి పర్యావరణం ప్రమాదంలో పడుతోంది. ఏటా పంజాబ్‌, హరియాణాల్లో పంట వ్యర్థాల్ని దహనం చేయడంవల్ల దిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయులకు చేరుతోంది. ఈ విషయంలో రైతులకు ప్రభుత్వాలే ప్రత్యామ్నాయాలను సూచించాలి. పర్యావరణ సమస్యల్ని ఎదుర్కొనే విషయంలో నియంత్రణ ప్రాధికార సంస్థలు క్రియాశీలపాత్ర పోషించాలి. వీటికి ప్రజల నుంచీ సహకారం లభించాలి.

మధ్యకాలిక ప్రణాళిక అవసరం

చివరగా ఏడాది వ్యవధిలో వినియోగ వృద్ధితోపాటు ఆర్థిక వృద్ధీ తగ్గింది. ప్రపంచ ఆర్థిక నివేదికలో పేర్కొన్న మూడు సవాళ్ల పురోగతి పరిస్థితి మిశ్రమంగా ఉంది. ఉద్యోగిత కల్పనలో క్షీణత కనిపిస్తోంది. వంటగ్యాస్‌ అందుబాటు, విద్యుత్తు, ఆర్థిక సమ్మిళితం పెరగడం, బహిరంగ మలవిసర్జన తగ్గడం వంటివి గ్రామీణ ప్రాంతాల్లో కనిపించాయి. ఆరోగ్య రంగంపైనా కొంతమేర దృష్టి కేంద్రీకరించారు. సార్వజనీన ఆరోగ్య కవరేజీ అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణం, కాలుష్య స్థాయులు ఎక్కువవుతున్నా, వాటిపై అవగాహనా అధికమైంది. భారత్‌ వంటి సువిశాల దేశంలో సమస్యలు ఒక రాష్టం నుంచి మరో రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల ఈ మూడు సవాళ్లను ఎదుర్కొనే విషయంలో కేంద్రంతోపాటు రాష్ట్రస్థాయి విధానాలు, కార్యాచరణలు అవసరం. వినియోగం, వృద్ధి వంటివాటిని పెంచే దిశగా సవాళ్లను ఎదుర్కొనేందుకు మధ్యకాలిక ప్రణాళిక అవసరం. వినియోగం విషయంలో సేద్య రంగంలో ఆదాయాలు ముఖ్యం కాబట్టి- వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన సవాళ్లను ప్రపంచ ఆర్థిక నివేదిక ప్రస్తావించిన మూడు సవాళ్లకు జతచేర్చడం మంచిది.

గ్రామీణ భారతాన వెలుగులు

గ్రామీణ ప్రాంతాల సామాజికార్థిక సమ్మిళితంలో ‘ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ’ది కీలక భూమిక. ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం పౌరులకు ఎలెక్ట్రానిక్‌ రూపంలో సేవలు అందేలా చేయడంతోపాటు, అంతర్జాల అనుసంధానాన్ని పెంచింది. దేశం డిజిటల్‌ రూపంలో సాధికారత సాధించేలా తోడ్పడింది. ఈ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్ని అధిక వేగంతో పనిచేసే అంతర్జాలంతో అనుసంధానించే ప్రణాళికలూ ఉన్నాయి. దేశంలో మొబైల్‌ అనుసంధానత భారీస్థాయిలో పెరిగినా, అంతర్జాలం విస్తృతి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఓ సమస్యగానే ఉంటోంది. ప్రధానమంత్రి జనధన్‌ యోజన దేశంలో ఆర్థిక సమ్మిళితాన్ని సాధించడంలో గణనీయంగా కృషిచేసింది. 2019 సెప్టెంబర్‌ నాటికి కొత్త జన్‌ధన్‌ ఖాతాల్లో పెరుగుదల రూ.37.1 కోట్లకు చేరింది. రూ.1.02 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. 59 శాతం మేర గ్రామీణ ప్రాంతాల ఖాతాలు నిర్వహణలో ఉన్నాయి. వాస్తవానికి రెండేళ్లుగా ఈ ఖాతాల్లో స్తబ్ధత నెలకొంది. సగటు నిల్వల్లో సైతం తగ్గుదల కనిపిస్తోంది.

-రచయిత ఎస్​. మహేంద్ర దేవ్​(ఇందిరాగాంధీ అభివృద్ధి పరిశోధన సంస్థ సంచాలకులు, ఉపకులపతి)

RESTRICTION SUMMARY: PART MUST CREDIT LEAH SULLIVAN, PART AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Kauai, Hawaii – 17 December 2019
1. Aerial of Kauai, Na Pali Coast
2. Aerial of waterfall
3. Ground shot of Kauai, Na Pali Coast
4. Aerial of Kauai, Na Pali Coast
++VALIDATED USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio checked against known locations and events
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Leah Sullivan
++Mandatory courtesy Leah Sullivan
Kauai, Hawaii – 17 December 2019
5. Various, aerials UGC of Kauai, Na Pali Coast
STORYLINE:
Rescuers resumed searching Friday for a tour helicopter carrying seven people that disappeared during a trip to one of the most rugged and remote coastlines in Hawaii.
A search that began Thursday night was expanded Friday morning, but the steep terrain, low visibility, choppy seas and rain made the effort challenging, the Coast Guard said.
The helicopter company, identified as Safari Helicopters, contacted the Coast Guard about 45 minutes after the aircraft was due back from a tour of Kauai's Na Pali Coast on Thursday evening, a Coast Guard statement said.
The Eurocopter AS350 helicopter took off from the town of Lihue, Federal Aviation Administration spokesman Ian Gregor said.
The helicopter has an electronic locator, but no signals had been received, according to the Coast Guard.
The chopper was carrying a pilot and six passengers, two of whom were believed to be minors, the Coast Guard said.
Clouds and rain at the scene limited visibility to 4 miles (6.4 kilometers), with winds at 28 mph (45 kph). Friday's forecast predicted winds were at about 23 mph (37 kph).
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 28, 2019, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.