ETV Bharat / business

40% దాకా నష్టపోయిన సెన్సెక్స్‌ షేర్లు... 2 నెలల్లో ఏమైంది?

స్టాక్​మార్కెట్లు ఎన్నడూ లేనంతగా నష్టపోతున్నాయి. కోట్లాది రూపాయల మదుపరుల సొమ్ము ఆవిరైపోతోంది. విచిత్రంగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 40 శాతం దాకా నష్టపోవడం. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు.. మన మార్కెట్ల పతనానికి కూడా ఎన్నో కారణాలు.

The stock market lost 40%. What happened in 2 months?
40% దాకా నష్టపోయిన సెన్సెక్స్‌ షేర్లు... 2 నెలల్లో ఏమైంది?
author img

By

Published : Mar 11, 2020, 9:16 AM IST

కొత్త సంవత్సరం కలిసిరాలేదు. ఏడాది ప్రారంభమై పట్టుమని రెండు నెలలు పూర్తయి.. మూడో నెలకు అడుగు పెట్టామో లేదో కానీ.. మదుపర్ల ముఖచిత్రం మారిపోతోంది. ఆశలు కాస్తా ఆవిరవుతున్నాయి. ఏదో చిన్న చితకా షేర్లో.. మూలాలు అంతగా బలంలేని షేర్లో.. నష్టపోయాయంటే అర్థముంది. కానీ దిగ్గజాలనదగ్గ సెన్సెక్స్‌ షేర్లు కూడా కుదేలుకావడమే ఇక్కడ గమనించదగ్గ విషయం. విచిత్రం ఏమిటంటే రెండు నెలల వ్యవధిలో ఏకంగా 40 శాతం దాకా నష్టపోవడం. కొన్ని షేర్లు మాత్రమే ఈ నష్టాలను నిలువరించి లాభాల్లోకి వెళ్లాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలని.. మన మార్కెట్ల పతనానికి కూడా ఎన్నో కారణాలు.

  • అమెరికా, చైనాల మధ్య సంఘర్షణ మొత్తం అన్ని మార్కెట్లపైనా కనిపించింది. ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతూ ఈ పరిణామాలు వెళ్లాయి. ఒకసారి అనిశ్చితి చల్లారినట్లు వార్తలు రావడం.. అంతలోనే ట్రంప్‌ ఏదో వ్యాఖ్యలు చేయడం.. దాంతో చర్చలు ఒప్పందం వరకూ వస్తాయో లేదోనని ఆందోళనలు రావడం. ఇలా మన మార్కెట్లతో పాటు.. అన్ని మార్కెట్లను ఇవి ఆందోళనల్లో నెట్టాయి. అయితే బడ్జెట్‌ సమయం వరకు కూడా మన మార్కెట్లు ఆ ఒత్తిళ్లను తట్టుకున్నాయి. అయితే ఆ తర్వాత నీలినీడలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులకు తోడు బడ్జెట్‌లో బలమైన కేటాయింపులు లేకపోవడం మదుపర్లకు..ముఖ్యంగా విదేశీ సంస్థాగత మదుపర్లకు రుచించలేదు. అక్కడి నుంచి పడుతూ వచ్చింది. ఇందుకు సెన్సెక్స్‌ షేర్లేమీ మినహాయింపు కాదు.
  • ఇక ఆ తర్వాత కరోనా వైరస్‌ రావడం ఆలస్యం.. మార్కెట్లు పూర్తిగా దాని అదుపులోకి వెళ్లాయని చెప్పాలి. చైనాలో మొదలైన ఈ వైరస్‌.. క్రమక్రమంగా అన్ని దేశాలకూ వ్యాపించడం..చైనా వంటి తయారీ దేశంలో పరిశ్రమలు మూతపడడంతో మొత్తం ప్రపంచం మీద ప్రభావం కనిపించింది. ఆర్థిక వ్యవస్థ కాస్తా మాంద్యంలోకి వెళుతుందేమోన్న భయాలు తెచ్చిపెట్టింది.
  • సోమవారం నాడు మార్కెట్లు ఎందుకు అంత భారీగా పడ్డాయో అందరికీ తెలుసు. ఓ వైపు కరోనా.. మరోవైపు ముడి చమురు ధరల క్షీణతలు మార్కెట్లు కుప్పకూలేలా చేశాయి. సాంకేతిక అంశాలు మనకు కలిసిరాకపోవడం గమనార్హం.

ఆరు షేర్లు 24%-42% నష్టాల్లో

సెన్సెక్స్‌-30 సూచీలో ఓఎన్‌జీసీ కూడా బాగా దెబ్బతింది. జనవరి 1న రూ.127.45గా ఉన్న ఈ షేరు ధర సోమవారం రూ.74.65 వద్ద నిలిచింది. అంటే రెండు నెలల వ్యవధిలో 40 శాతానికి పైగా కుదేలైంది. చమురు ధర పతనం ఇందుకు కారణంగా నిలిచిందని చెప్పాలి. ఇక ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎస్‌బీఐలు కూడా 24-39% వరకు డీలా పడ్డాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అయితే సోమవారం ఒక్క రోజే రూ.1.08 లక్షల కోట్ల మేర మార్కెట్‌ విలువను కోల్పోయింది. ఇది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల అర్థవార్షిక బడ్జెట్‌కు సమానం. ఇంత వరకు అత్యంత విలువైన కంపెనీగా ఉన్న ఇది రెండో స్థానానికి పడిపోయింది. జియో లాభాలు రాణిస్తున్నా.. రిఫైనింగ్‌ మార్జిన్లు క్షీణించడం ఇందుకు నేపథ్యం.

పదిహేడు షేర్లు 5-20% నష్టాలు

మరో పదిహేడు షేర్లు 5-20 శాతం వరకు ఈ రెండు నెలల వ్యవధిలో నష్టపోయాయి. కేవలం ఆరు షేర్లు మాత్రమే సెన్సెక్స్‌లో లాభాలను అందుకున్నాయి.(పట్టిక చూడండి)

The stock market lost 40%
40% దాకా నష్టపోయిన సెన్సెక్స్‌ షేర్లు

భవితవ్యం..వైరస్‌ చేతిలో..

కరోనా వైరస్‌ ఎన్నాళ్ల పాటు.. ఎంత వేగంగా వ్యాపిస్తుంది లేదా ఎంత వేగంగా అదుపులోకి వస్తుందన్న విషయంపై ఆధారపడి ప్రపంచ మార్కెట్లన్నీ చలించనున్నాయి. ఇక ప్రపంచ మార్కెట్లతో సంబంధం లేకుండా ముడి చమురు ఉత్పత్తిని పెంచుతామని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకోవడంతో చమురు షేర్ల కదలికలనూ గమనించకతప్పని పరిస్థితి. సాంకేతికంగా నిఫ్టీ 10,270 పాయింట్లపైన ఉన్నంత కాలం బలమైన బౌన్స్‌ బ్యాక్‌(పుంజుకోవడం) ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఒక వేళ 10,100 వద్ద మళ్లీ మనకు బలమైన మద్దతు ఉంది. ఆ స్థాయి కూడా విఫలమైతే మాత్రం మార్కెట్లు ఎంత వరకు వెళతాయో తెలియని పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా మదుపర్లు మాత్రం అత్యంత అప్రమత్తతతో పొజిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: బీఎస్​ 6: కొత్త ప్రమాణంతో కాలుష్యానికి కళ్లెం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.