ETV Bharat / business

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందే! - ప్రేమికుల రోజునాటి వ్యాపార సరళి

ప్రేమికుల రోజు.. ప్రపంచవ్యాప్తంగా రూ.లక్షల కోట్ల వ్యాపారం నడిచే రోజిది. యువతీ, యువకులకు వినూత్న బహుమతులు, పర్యటన ఏర్పాట్లు, విందు-వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో కంపెనీలు, ఆన్‌లైన్‌ గిఫ్టింగ్‌ - ఈ-కామర్స్‌ పోర్టళ్లు, పర్యాటక సేవలు అందించే సంస్థలు పోటీపడుతున్నాయి.

The Key Consumer Spending Trends On Valentine's Day
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందే..
author img

By

Published : Feb 14, 2020, 8:15 AM IST

Updated : Mar 1, 2020, 7:12 AM IST

పాశ్చాత్యదేశాల నుంచి మన దేశానికి విస్తరించిన వాలెంటైన్స్‌ డే (ఈనెల 14) సందర్భంగా మన దేశంలోనూ వ్యాపారం భారీగానే జరుగుతోంది. ఆర్థిక మందగమనానికి తోడు, కరోనా వైరస్‌ భయాందోళనలు పెరుగుతున్న వేళ, ఈ వేడుకలకు యువత ఎలా స్పందిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నా.. తమ ప్రియ నిచ్చెలితో ఆనందంగా గడిపేందుకు యువత ముందుకొస్తారనే భావనతోనే సంస్థలు ఏర్పాట్లు చేశాయి.

ప్రేమికుల రోజు ... యువత హుషారు

అసోచామ్‌ అంచనా ప్రకారం 2014లోనే రూ.22,000 కోట్ల వ్యాపారం జరిగింది. చాకొలెట్లు, కేక్‌లు, గులాబీలు ఇచ్చి, పుచ్చుకోవడం అధికంగా ఉన్నా, సాఫ్ట్‌టాయ్స్‌, వాచీలు, స్మార్ట్‌ఫోన్లు, అధునాతన హెడ్‌ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్స్‌, చిన్నపాటి బంగారు ఆభరణాలు, వన్‌గ్రామ్‌ గోల్డ్‌ ఉత్పత్తులు, రెడీమేడ్‌ దుస్తులు, మేకప్‌సామగ్రి, పరిమళ ద్రవ్యాలు (పెర్‌ఫ్యూమ్స్‌), వాలెట్లు-హ్యాండ్‌బ్యాగ్‌ల వంటివీ అధివిదేశాల్లో ఉన్న యువతీ - యువకులు, కొత్తగా వివాహమైన వారు దేశంలోనే ఉన్న తమ భాగస్వాముల మనస్సు దోచే బహుమతులు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌ గిఫ్టింగ్‌ పోర్టళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇతర పండుగల కంటే ప్రేమికులరోజు సందర్భంగా ఇచ్చే బహుమతుల ‘సగటుమొత్తం’ అధికంగా ఉంటోందని యూఎస్‌టు గుంటూర్‌ పోర్టల్‌ ఎండీ శ్రీధర్‌ తెలిపారు.

30 డాలర్లు: సగటు బహుమతి విలువ

75 శాతం: విదేశాల నుంచి వస్తున్న ఆర్డర్లలో యువకుల వాటా. మిగిలిన ఆర్డర్లు యువతులవి ఉంటాయని చెబుతున్నారు.

రూ.2,00,000 కోట్లు: అమెరికన్లు ఈరోజు వెచ్చిస్తారని అంచనా వేస్తున్న మొత్తం

గులాబీల అమ్మకాలు-ఎగుమతి

ప్రేమికుల రోజున ఎర్రగులాబీలు అందించి తమ ప్రేమను వ్యక్తపరచేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు. ఆకులు, కాండంతో ఉండే హైబ్రిడ్‌ గులాబీల ధరలు సాధరణరోజులతో పోలిస్తే, 20-25 శాతం అధికమైంది. ఈ పూలు పండే పుణె, కొల్హాపూర్‌ (మహారాష్ట్ర), బెంగళూరు వంటి ప్రాంతాల్లో గతేడాది వర్షాల వల్ల దిగుబడి తగ్గింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బ్రిటన్‌, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌ వంటి దేశాలకూ మన దేశం నుంచి గులాబీలు ఎగుమతి అవుతున్నాయి.

మూడు రోజుల విహారం

యువ జంటలను ఆకర్షించేందుకు స్టార్‌హోటళ్లు, పబ్‌లు వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈసారి వేడుక శుక్రవారం కావడంతో, ఆరోజు, శని-ఆదివారాలు కలిపి 3 రోజుల విరామాన్ని విశ్రాంతి తీసుకోడానికి, విలాసవంతంగా సేదతీరేందుకు కేటాయిస్తున్నారు. బుకింగ్‌లు 90 శాతం పైగా పెరిగినట్లు ఓయో తెలిపింది. ట్రెక్కింగ్‌ - రాఫ్టింగ్‌ వంటి వినోద-సాహస భరిత కార్యక్రమాలకు చోటుండే ప్రాంతాలకు వెళ్లేందుకు ఈసారి యువత టికెట్లు బుక్‌ చేసుకున్నారని పర్యాటక ప్యాకేజీ సేవలు అందించే థామస్‌కుక్‌ ఇండియా వెల్లడించింది.

ఈ ప్రాంతాలకు సై

స్కైడైవింగ్‌ జరిగే ప్రదేశాలకు, రిషికేశ్‌లో వైట్‌రివర్‌ రాఫ్టింగ్‌, మేఘాలయాలో గుహల్లో పర్యటనలు, జైసల్మేర్‌, తెక్కడి (కేరళ)లో జీప్‌ సఫారీ, ఇండొనేషియాలో క్వాడ్‌బైకింగ్‌, షార్క్‌ చేపలతో కలిసి స్విమ్మింగ్‌ చేసేందుకు థాయ్‌లాండ్‌, మనాలీ, గోవా, దుబాయ్‌, అబుధాబిలకు వెళ్లేందుకు సంపాదనా పరులైన యువత టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారని సమాచారం.

  • మాల్దీవులు, టస్కనీ ఫ్రాన్స్‌, ఐర్‌లాండ్‌, స్కాట్‌లాండ్‌, జపాన్‌, దక్షిణాఫ్రికా, కాలిఫోర్నియా పర్యటనలకూ మరికొందరు వెళ్తున్నారు.
  • జంటగా వెళ్తున్న వారు 55 శాతం మంది అయితే, ఒంటరిగా, స్నేహితులు/కుటుంబసభ్యులతో కలిసి బృందాలుగా వెళ్తున్న వారు 45 శాతం మంది ఉంటున్నారు.
  • యువతను ఆకట్టుకునేందుకు ఇండిగో రూ.999 నుంచి, ఎయిరేషియా ఇండియా రూ.1014 నుంచి విమాన టికెట్లు నేటి అర్ధరాత్రి వరకు విక్రయిస్తున్నాయి. సెప్టెంబరు 30 వరకు ప్రయాణానికి వీటిని వినియోగించుకోవచ్చు.

ఇదీ చూడండి: ఫేస్​బుక్, ట్విట్టర్​కు రష్యాలో భారీ జరిమానా

Last Updated : Mar 1, 2020, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.