ETV Bharat / business

గంటకు 740 కి.మీ. వేగంతో సరికొత్త 'బుల్లెట్'​ విమానం! - Celera 500L specialites

విమానయానాన్ని సులభతరం చేసే దిశగా సరికొత్త విమానాన్ని తయారు చేస్తోంది అమెరికాలోని ఒట్టో ఏవియేషన్‌ సంస్థ. కోడిగుడ్డు లేదా బుల్లెట్‌ రూపులో ఉన్న ఈ బుల్లి విమానం ఇతర లోహ విహంగాలకు (Celera 500L specialites) భిన్నంగా ఎన్నో ప్రత్యేకతలతో వస్తోంది.

Celera 500L price
సెలెరా 500ఎల్‌
author img

By

Published : Nov 6, 2021, 7:10 AM IST

విమానయానంలో విప్లవం సృష్టించేందుకు అమెరికాలోని ఒట్టో ఏవియేషన్‌ సంస్థ సిద్ధమవుతోంది. 'సెలెరా 500ఎల్‌' పేరుతో తీసుకొచ్చిన సరికొత్త బుల్లెట్‌ విమానం ప్రస్తుతం సన్నాహక పరీక్షల దశలో ఉంది. కోడిగుడ్డు లేదా బుల్లెట్‌ రూపులో ఉన్న ఈ బుల్లి విమానం ఇతర లోహ విహంగాలకు భిన్నంగా (Celera 500L interior) ఎన్నో ప్రత్యేకతలతో వస్తోంది. విమానం ఉపరితలంపై గాలిని సాఫీగా వెళ్లేలా చేసి రాపిడిని తగ్గించేలా దీన్ని రూపొందించారు. తద్వారా తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం అధిక వేగంతో ప్రయాణించడమే దీని ప్రత్యేకత. తమ సెలెరా.. టర్బో జెట్‌ విమానాలతో పోలిస్తే 4-5 రెట్లు, జెట్‌ విమానాలతో పోలిస్తే 7-8 రెట్లు తక్కువగా ఇంధనాన్ని వినియోగించుకుంటుందని ఒట్టో ఏవియేషన్‌ సీఈవో విలియం చెప్పారు. ఓ గ్యాలన్‌ ఇంధనం (3.79 లీటర్లు) తో ఏకంగా 18-25 మైళ్లు ప్రయాణిస్తుంది. ఇదే పరిమాణంలో ఉండే బిజినెస్‌ క్లాస్‌ విమానాలతో పోల్చినా దీని నిర్వహణ ఖర్చు 80% తక్కువేనట. సెలెరా నడిచేందుకు గంటకు 328 డాలర్లు (Celera 500L price) ఖర్చవుతుంటే.. అదే పరిమాణంలో ఉండే బిజినెస్‌ క్లాస్‌ విమానానికి 2100 డాలర్ల వ్యయమవుతోంది.

డీజిల్‌ ఇంజిన్‌

జర్మనీకి చెందిన రెడ్‌ సంస్థ తయారుచేసే 'వీ12' ఇంజిన్‌ను 'సెలెరా 500ఎల్‌'కు అమర్చారు. కేబిన్‌ లోపల ఎత్తు 6.2 అడుగులుంటుంది. ఆరుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. గంటకు 740 కి.మీ. వేగంతో ఏకధాటిగా 7242 కి.మీ. వెళ్లగలదు. "విలాసవంతమైన విమానాలతో తిరిగే సంపన్నులకు సెలెరా పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ ప్రస్తుత వాణిజ్య విమానాల తీరుతో విసిగిపోయిన వారికి మాత్రం ఈ విమానం గొప్ప అనుభూతినిస్తుంది" అని ఒట్టో సంస్థ పేర్కొంది. ప్రస్తుతానికి దీని ధర రూ.37.5 కోట్లుగా ఉందని, 2025 నాటికి అమ్మకాలు ప్రారంభమవుతాయని చెప్పింది. అయితే సెలెరా సమర్థతను సన్నాహక పరీక్షల్లో పరిశీలించాల్సి ఉందని తోటి విమానయాన సంస్థల ప్రతినిధులు అంటున్నారు.

ఇదీ చదవండి:'అంబానీ ఎక్కడికీ వెళ్లడం లేదు.. ఆ వార్తలు అవాస్తవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.